Tirumala: భక్తులకు కర్రల పంపిణీ.. ట్రోల్స్‌పై స్పందించిన తితిదే ఛైర్మన్‌

తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కిన ప్రదేశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు.

Updated : 17 Aug 2023 11:36 IST

తిరుమల: తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కిన ప్రదేశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. బోనులో చిక్కిన మగ చిరుతకు దాదాపు ఐదేళ్ల వయస్సు ఉంటుందని తెలిపారు. మరోవైపు, అలిపిరి నడక మార్గంలో భక్తులకు కర్రల పంపిణీపై సోషల్‌ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌ను ఛైర్మన్‌ భూమన ఖండించారు. అటవీశాఖ అధికారుల సూచన మేరకే కర్రలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. కర్రలు ఇచ్చి తితిదే బాధ్యతలను తప్పించుకుంటుందని ట్రోల్స్‌ చేయడం సమంజసం కాదన్నారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆపరేషన్‌ చిరుతను కొనసాగిస్తామని, మరిన్ని చిరుతలు బంధించేలా కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు.

చిక్కిన మరో చిరుత

ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఎస్వీ జూ పార్కు నుంచి చిరుతలు తెచ్చి వదులుతున్నామంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఈ తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నాం. చిరుత సంచారంపై నిఘా కోసం కెమెరాలు ఏర్పాటు చేశాం. ఎలుగుబంట్ల సంచారంపై డ్రోన్‌ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టాం’’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని