Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 24 Aug 2023 13:02 IST

1. రెజ్లింగ్‌ సమాఖ్యపై సస్పెన్షన్‌ వేటు

రెజ్లింగ్‌ విభాగంలో ప్రపంచ వేదికపై భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) సభ్యత్వాన్ని నిరవధికంగా సస్పెండ్‌ చేస్తున్నట్లు యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (UWW) ప్రకటించింది. సమాఖ్య ఎన్నికలు నిర్వహించడంలో డబ్ల్యూఎఫ్‌ఐ విఫలమైనందుకు ప్రతిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూడబ్ల్యూడబ్ల్యూ వెల్లడించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కుమిలిపోం.. మా సత్తా ఏంటో చూపిస్తాం: కూనంనేని

భారాస చేసిన తప్పుతో కుమిలిపోకుండా తమ సత్తా ఏంటో చూపిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasivarao) వెల్లడించారు. సమరశీల పోరాటాలు చేసి గ్రామగ్రామానా పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూనంనేని మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మంత్రి గంగుల కమలాకర్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత

కరీంనగర్‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల హామీలు నెరవేర్చాలన్న డిమాండ్‌తో భాజపా శ్రేణులు.. మంత్రి ఇంటి ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. వారు ప్రతిఘటించడంతో ఉద్రిక్తత నెలకొంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. గొంతు కోసి, కాళ్లను శరీరం నుంచి వేరు చేసి..

సిద్దిపేట జిల్లాలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమె ఇంట్లోనే దుండగులు గొంతు కోసి కాళ్లను శరీరం నుంచి వేరు చేశారు. ములుగు మండలం బండమైలారంలో ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలిని గజ్వేల్‌ ఏసీపీ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భార్యపై కోపంతో బార్‌ వద్ద కాల్పులు.. ఐదుగురు మృతి

అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల మోత (Mass Shooting) మోగింది. కాలిఫోర్నియా (California)లోని ఆరెంజ్‌ కౌంటీలో ప్రముఖ బైకర్స్‌ బార్‌ వద్ద దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. అమెరికా (USA) కాలమానం ప్రకారం.. బుధవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మియాపూర్ ఘటన.. ఉద్యోగం పోగొట్టాడనే కక్షతోనే కాల్పులు!

మియాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ హోటల్‌ జనరల్‌ మేనేజర్‌పై జరిగిన కాల్పుల ఘటన కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని కేరళకు చెందిన రితీష్‌ నాయర్‌గా గుర్తించి అదుపులోకికి తీసుకున్నారు. మదీనాగూడలోని సందర్శిని హోటల్‌ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న దేవేందర్‌ గాయన్‌ (35)పై బుధవారం అర్ధరాత్రి కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. చంద్రుడిపై నడయాడిన భారత్‌: ఇస్రో ట్వీట్‌

జాబిల్లి యాత్రల్లో ఇప్పటిదాకా ఏ దేశమూ అందుకోలేకపోయిన సంక్లిష్ట లక్ష్యాన్ని ఇస్రో విజయవంతంగా ఛేదించి చరిత్ర సృష్టించింది. చందమామ దక్షిణ ధ్రువం వద్ద విక్రమ్‌ ల్యాండ్ అయిన దాదాపు నాలుగు గంటల తర్వాత దాని లోపలి నుంచి ప్రగ్యాన్‌ రోవర్ సాఫీగా బయటకు వచ్చింది. దీనిపై భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ISRO) స్పందించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Prigozhin Death: కొత్తేముందన్న బైడెన్‌.. ఇంత లేట్ అవుతుందనుకోలేదన్న మస్క్‌

వాగ్నర్‌ గ్రూప్‌ అధినేత యెవ్‌గనీ ప్రిగోజిన్‌(62)(Wagner mercenary chief Yevgeny Prigozhin) బుధవారం విమాన ప్రమాదంలో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విమాన ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Biden) మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన వెనక వాస్తవాలు తనకు తెలియదన్నారు. ‘కానీ దీనిపై నేనేమీ ఆశ్చర్యపోలేదు’ అని వ్యాఖ్యానించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పసిఫిక్‌ సముద్రంలోకి అణుజలాలు విడుదల మొదలు..!

జపాన్‌ (Japan) అణు జలాలను పసిఫిక్‌ సముద్రంలోకి విడుదల చేయడం మొదలుపెట్టింది. 2011లో ఫుకుషిమా (Fukushima) అణుకేంద్రం సునామీ కారణంగా దెబ్బతిన్న నాటి నుంచి ఈ నీటిని భారీ ట్యాంకుల్లో నిల్వ చేసింది. ఇక్కడ మొత్తం 1.34 మిలియన్‌ టన్నుల అణు జలాలు ఉన్నాయి. వీటిల్లో నేడు 200 నుంచి 210 క్యూబిక్‌ మీటర్ల నీటిని శుద్ధి చేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆసియాలోని 46 దేశాల్లో పెరిగిన పేదరికం..!

కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా అతలాకుతలం చేసింది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ద్రవ్యోల్బణం (Inflation) గతేడాది ఆసియా (Asia)లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని దాదాపు 7 కోట్ల మందిని దుర్భరమైన పేదరికంలోకి నెట్టిందని ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ADB) నివేదిక గురువారం వెల్లడించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని