USA: భార్యపై కోపంతో బార్‌ వద్ద కాల్పులు.. ఐదుగురు మృతి

అమెరికాలోని కాలిఫోర్నియాలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఇందులో పలువురు మృతిచెందగా.. నిందితుడిని పోలీసులు హతమార్చారు.

Updated : 24 Aug 2023 13:11 IST

కాలిఫోర్నియా: అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల మోత (Mass Shooting) మోగింది. కాలిఫోర్నియా (California)లోని ఆరెంజ్‌ కౌంటీలో ప్రముఖ బైకర్స్‌ బార్‌ వద్ద దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. అమెరికా (USA) కాలమానం ప్రకారం.. బుధవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు మృతిచెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు రిటైర్డ్‌ పోలీసు అధికారి అని అమెరికా (America) మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. తనను దూరం పెడుతున్న భార్యను లక్ష్యంగా చేసుకుని నిందితుడు ఈ కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది.

కాల్పుల ఘటన గురించి సమాచారం అందగానే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. నిందితుడిని అడ్డుకునేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు హతమయ్యాడు. ఈ ఘటనలో మొత్తం 11 మందిపై కాల్పులు జరగ్గా.. నిందితుడు సహా ఐదుగురు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురిని ఆసుపత్రికి తరలించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని