Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 27 Aug 2023 13:16 IST

1. ఈసారి ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌..: అశోక్‌ గహ్లోత్‌

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా (PM candidate) కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఇండియా కూటమి తరఫున బరిలోకి దిగనున్నట్లు రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot) వెల్లడించారు. ఈ విషయంపై ఇండియా (I.N.D.I.A) కూటమిలో చర్చించినట్లు తెలిపారు. అయితే, ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ ఉండేందుకు అన్ని పార్టీలు సమ్మతించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదీ సర్కారుపై ఆయన విమర్శలు గుప్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నేనేమీ బాధపడటం లేదు.. యూపీ టీచర్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లో ముజఫర్‌నగర్‌లోని ఓ ఉపాధ్యాయురాలు పాఠశాలలో చేసిన మతపరమైన వ్యాఖ్యలు, ఆమె ప్రవర్తనకు సంబంధించిన వీడియో దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై సదరు ఉపాధ్యాయురాలు స్పందించారు. తాను చేసిన పనికి ఏ మాత్రం బాధపడటం లేదని పేర్కొనడం గమనార్హం. సదరు మహిళ ఆ పాఠశాలకు ప్రధానోపాధ్యాయురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి!

బాణసంచా (Firecracker) ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుని ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తర 24 పరగణా జిల్లాలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. దీంతో అందులో పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే  మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. డ్రగ్స్‌ పట్టివేతలో చేతివాటం.. ఎస్సై రాజేందర్‌ అరెస్ట్

డ్రగ్స్‌ పట్టివేతలో ఓ ఎస్సై చేతివాటం ప్రదర్శించాడు. నార్కోటిక్‌ విభాగం అధికారులు వలపన్ని పట్టుకోవడంతో అతడి అవినీతి బయటపడింది. దీంతో ఎస్సైను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ విభాగంలో (సీసీఎస్‌) రాజేందర్‌ ఎస్సైగా పనిచేస్తున్నారు. నిందితుల వద్ద పట్టుబడిన డ్రగ్స్‌లో సుమారు 1,750 గ్రాముల వరకు దాచిపెట్టి అమ్మేందుకు ఎస్సై యత్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అదనపు వైన్‌ నాశనం చేయించడానికి రూ. 1,700 కోట్ల ఖర్చు..!

మద్యం కొనుగోలుకు మందుబాబులు జేబులను గుల్ల చేసుకొంటుండగా.. ఫ్రాన్స్‌ (France) మాత్రం ఉన్న మద్యం స్టాక్‌ను వదిలించుకోవడానికి ఏకంగా 200 మిలియన్‌ యూరోలు (రూ.1,700 కోట్లు) ఖర్చు పెట్టేందుకు సిద్ధమైంది. తాజాగా దేశంలో అదనంగా ఉన్న వైన్‌ను ధ్వంసం చేయాలని నిర్ణయించింది. వైన్‌కు మంచి ధర తీసుకొచ్చేందుకు చేపట్టిన చర్యలో ఇది కూడా ఓ భాగం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. విశాఖలో కుంగిన నూతన బస్‌ షెల్టర్‌

విశాఖ మహా నగరపాలక సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన మోడ్రన్‌ బస్‌ షెల్టర్‌ కుంగింది. జీవీఎంసీ కార్యాలయం ముందు కొత్తగా నిర్మించిన ఆర్టీసీ బస్‌ షెల్టర్‌ ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. ఘటన జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రూ.40లక్షల వ్యయంతో నిర్మించిన ఈ బస్‌షెల్టర్‌ను ఐదు రోజుల క్రితం నగర మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి ప్రారంభించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. శ్రీలీల కొత్త టాలెంట్‌.. మనసు పారేసుకుంటోన్న నెటిజన్లు

నటి శ్రీలీల (Sreeleela) అంటే సినీ ప్రియులకు టక్కున గుర్తుకువచ్చేది ఆమె డ్యాన్స్‌. పాట ఏదైనా సరే హీరోకి ఏమాత్రం తగ్గకుండా.. కొన్నిసార్లు హీరోలను మించి డ్యాన్స్‌ చేస్తారీ బ్యూటీ. తాజాగా ఆమె తనలోని మరో టాలెంట్‌ను తెలుగువారికి పరిచయం చేశారు. శ్రీలీల కథానాయికగా నటించిన కొత్త చిత్రం ‘స్కంద’ (Skanda). రామ్‌ హీరోగా నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. దుకాణదారుని బెదిరించి.. అడ్డంగా దొరికిపోయిన పోలీసు అధికారి భార్య!

 ఓ ప్రభుత్వ వాహనం.. దానిపై పోలీసు సైరన్‌.. వాహనంలో పోలీసు అధికారి భార్య.. ఆమెకు ఓ గన్‌మెన్‌.. ఇలా వస్తే ఏమైనా చేయొచ్చనుకుని ఓ పోలీసు అధికారి భార్య అడ్డంగా దొరికిపోయారు. సాటి పోలీసు అధికారి భార్యే కదా అని పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. వివరాలు.. కడప శివారులోని ఓ ప్రత్యేకమైన పోలీసు విభాగానికి చెందిన ఓ పోలీసు అధికారి భార్య కొంతకాలంగా కడప వైవీ స్ట్రీట్‌కు వచ్చి తాను పోలీసు అధికారి భార్యనంటూ వస్త్ర దుకాణాదారుడిని భయపెట్టి వస్త్రాలు తీసుకెళ్లేవారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భారత్‌ విజయానికి ప్రతీక చంద్రయాన్‌-3: మోదీ

చంద్రయాన్‌-3 భారత్‌ విజయానికి ఎప్పటికీ ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని మోదీ (PM Modi) కొనియాడారు. మన్‌కీ బాత్‌ (Mann Ki Baat ) 104వ ఎపిసోడ్‌లో నేడు ప్రధాని మాట్లాడారు. తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్‌-3 ప్రాజెక్టు మహిళా సాధికారతకు చిహ్నంగా నిలిచిందన్నారు. భారత్‌ వచ్చే నెల దిల్లీలో జీ 20 సమావేశాలకు సిద్ధమవుతోందని.. గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 40 దేశాలకు చెందిన ప్రతినిధిలు హాజరుకానున్నారని వెల్లడించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ప్రేమించి మోసపోయిన బాలిక ఆత్మహత్య.. కంటతడి పెట్టించిన సూసైడ్ నోట్

ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో పాటు వేధింపులకు గురిచేస్తున్నడంటూ ఓ బాలిక లేఖ రాసి బలవన్మరణం చెందిన ఘటన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. బాలిక రాసిన లేఖ స్థానికులను కంటతడి పెట్టించింది. ఆరో ఠాణా ఎస్సై గణేశ్‌ కథనం ప్రకారం.. నగరానికి చెందిన ఓ బాలిక పదో తరగతి చదువుతోంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని