Firecracker: బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి!

పశ్చిమ బెంగాల్‌లోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో పలువురు మృతి చెందారు.

Updated : 27 Aug 2023 12:45 IST

కోల్‌కతా: బాణసంచా (Firecracker) ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుని ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 

ఉత్తర 24 పరగణా జిల్లాలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. దీంతో అందులో పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే  మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు ధాటికి భవనం పైకప్పు కూలింది. ఘటనాస్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అయితే.. ఈ ఫ్యాక్టరీని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇళ్ల మధ్యలో నిర్వహిస్తున్నారని సమాచారం. పశ్చిమబెంగాల్‌ స్టేట్‌ యూనివర్సిటీకి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఫ్యాక్టరీ ఉంది. ఈ ఘటన నేపథ్యంలో పక్కనే ఇళ్లలో నివసిస్తున్నవారిని అధికారులు అప్రమత్తం చేసి.. అక్కడి నుంచి తరలించారు.  ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని