Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 28 Aug 2023 13:18 IST

1. కాంగ్రెస్‌ వాళ్లను కాల్చి పడేస్తా: ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

కాంగ్రెస్‌పై నాగర్‌కర్నూల్‌కు చెందిన భారాస ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వాళ్లను కాల్చి పడేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలోని తెల్కపల్లి మండలంలో ‘పదేళ్ల ప్రజా ప్రస్థానంలో మర్రన్న’ పాదయాత్ర సందర్భంగా జనార్దన్‌రెడ్డి మాట్లాడారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఖైరతాబాద్‌లో విషాదం.. కుమార్తె మృతి తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

నగరంలోని ఖైరతాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. తన ఐదేళ్ల కుమార్తె మృతిని తట్టుకోలేని తండ్రి కిశోర్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇటీవల అనారోగ్యంతో చిన్నారి మృతి చెందింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని తండ్రి.. ఆ బాధతో ఖైరతాబాద్‌లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ ఎంతో ప్రత్యేకం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

భారతీయ సినిమా చరిత్రలో నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్‌) ఎంతో ప్రత్యేకమని.. రాజకీయాల్లోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము అన్నారు. ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఏఐ పురోగతిని నిలువరించలేం: మైక్రోసాఫ్ట్‌ అధ్యక్షుడు

కృత్రిమ మేధ (Artificial Intelligence- AI) వినియోగంపై అంతర్జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరుగుతున్న తరుణంలో మైక్రోసాఫ్ట్‌ అధ్యక్షుడు బ్రాడ్‌ స్మిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ శక్తిమంతమైన సాంకేతికత (Artificial Intelligence)లో వస్తున్న పురోగతిని నిలువరించడం సాధ్యం కాదని చెప్పారు. ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో నిబంధనలు రూపొందించడం ఒక్కటే మార్గమని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కాలేజీ వ్యాన్‌ ఢీకొని జీహెచ్‌ఎంసీ కార్మికురాలు మృతి

కింగ్‌కోఠిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు సునీత(35) మృతి చెందింది. అయాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ కళాశాలకు చెందిన బస్సు అతివేగంగా వచ్చి రహదారి పక్కనే ఉన్న చెట్టు దగ్గర శుభ్రం చేస్తున్న కార్మికురాలిని బలంగా ఢీకొట్టింది. వెంటనే స్థానికంగా ఉన్న జీహెచ్‌ఎంసీ కార్మికులు స్పందించి.. ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. బాలిక లక్షితపై ఏ చిరుత దాడి చేసిందో ఇంకా తేలలేదు: సీసీఎఫ్‌వో

అలిపిరి కాలినడక మార్గంలో ఆదివారం రాత్రి బోనులో చిక్కిన చిరుతను తిరుపతి జూపార్క్‌కు తరలించినట్లు అటవీశాఖ చీఫ్‌ కన్జర్వేటివ్‌ ఆఫీసర్‌ (సీసీఎఫ్‌వో) నాగేశ్వరరావు తెలిపారు. చిరుత రక్త నమూనాలు సేకరించి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.   పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నీ ఆటోగ్రాఫ్‌ ఇస్తావా..? చిన్నారిని అడిగిన రాహుల్

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) గత కొన్ని రోజులుగా వరుస టూర్లతో ప్రజలను కలిసిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఊటీలో ఒక చాక్లెట్‌ తయారీ కర్మాగారాన్ని సందర్శించిన రాహుల్.. దానికి సంబంధించిన వీడియోను ఆదివారం సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గాల్లోనే చిన్నారికి పునర్జన్మ ఇచ్చిన వైద్యులు..!

విమాన ప్రయాణంలో ఊపిరి ఆగిపోయిన స్థితిలో ఉన్న రెండేళ్ల చిన్నారిని ఒక వైద్య బృందం కాపాడింది. బెంగళూరు (Bangalore) నుంచి దిల్లీ ( Delhi)కి బయలుదేరిన విస్తార (Vistara) సంస్థకు చెందిన యూకే 814 విమానంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. హిజాబ్‌ ధరించకుంటే పార్క్‌లోకి నో ఎంట్రీ.. మహిళలపై తాలిబన్ల ఆంక్షలు

ఆఫ్గానిస్థాన్‌(Afghanistan)లో తాలిబన్లు (Talibans) అధికారం కైవసం చేసుకున్న తర్వాత మహిళలపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. కొద్ది నెలల క్రితం మహిళలను మాద్యమిక విద్యతోపాటు, యూనివర్శిటీలో చదువులకు దూరం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత దూర ప్రయాణాలు, బ్యూటీ సెలూన్లపై నిషేధం విధించారు. తాజాగా, హిజాబ్‌ ధరించని మహిళలను బమియాన్‌లోని బంద్‌-ఈ-అమిర్‌ జాతీయ పార్కు సహా దేశంలోని ఇతర జాతీయ పార్కుల్లోకి అనుమతించకూడదని నిర్ణయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. దిశ కేసులో కీలక పరిణామం.. వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న విచారణాధికారి

దిశ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి విచారణ అధికారిగా పనిచేసిన సురేంద్ర స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్‌)కు దరఖాస్తు చేసుకున్నారు. ఈమేరకు డీజీపీ అంజనీ కుమార్‌కు వీఆర్‌ఎస్‌ దరఖాస్తును సమర్పించారు. ఇటీవల తరచుగా జరుగుతున్న బదిలీలపై అసంతృప్తి కారణంగానే సురేంద్ర వీఆర్‌ఎస్‌ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని