Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 01 Sep 2023 13:13 IST

1. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ ఖరారు

ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను విద్యాశాఖ ఖరారు చేసింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబరు 3 నుంచి 5 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు తీసుకోనుండగా.. 8, 9 తేదీల్లో సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. గత మార్చిలో దరఖాస్తులు సమర్పించినవారు సైతం వివరాల్లో సవరణలు చేసుకోవచ్చు. గతంలో దరఖాస్తు చేయనివారు బదిలీ కోసం కొత్తగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫారం సమర్పించవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కేఎల్ రాహుల్ స్థానంలో సంజూ ఆడొచ్చా..? రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

ఆసియా కప్‌లో (Asia Cup 2023) భాగంగా శనివారం భారత్ X పాకిస్థాన్ (IND vs PAK) జట్ల మధ్య పోరు జరగనుంది. తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్‌ అందుబాటులో ఉండడని ఇప్పటికే ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. దీంతో అతడి స్థానంలో సంజూ శాంసన్‌ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా..? అని అభిమానుల మదిలో తలెత్తే ప్రశ్న. అయితే, వికెట్‌ కీపర్ ఇషాన్‌ కిషన్‌ జట్టుతోపాటు ఉన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పాకిస్థానీయుల తిప్పలు.. రూ.300 మార్క్‌ దాటిన పెట్రోల్‌, డీజిల్‌

పొరుగు దేశం పాకిస్థాన్(Pakistan) ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దాంతో ధరల భారం మోయలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా వారిపై మరో పిడుగు పడింది. పెట్రోల్‌(petrol), డీజిల్‌(diesel) ధరలు రూ.300 మార్క్‌ దాటేశాయి. పాక్‌ చరిత్రలో చమురు ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. పాకిస్థాన్‌(Pakistan) ఆర్థికమంత్రిత్వ శాఖ గురువారం సాయంత్రం చమురు ధరల పెంపుపై ప్రకటన చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వాణిజ్య సిలిండర్‌పైనా ధర తగ్గింపు

వాణిజ్య వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర (Commercial LPG Cylinder Price)ను చమురు విక్రయ సంస్థలు తగ్గించాయి. రూ.19 కిలోల సిలిండర్‌ ధరపై రూ.158 తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించాయి. తాజా తగ్గింపుతో దేశ రాజధాని దిల్లీలో సిలిండర్‌ ధర (Commercial LPG Cylinder Price) రూ.1,522.50కు చేరింది. గృహ వినియోగ సిలిండర్‌పైన రూ.200 తగ్గిస్తూ కేంద్ర కేబినెట్‌ ఇటీవలే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఏమిటీ ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’?

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు దాదాపు పక్షం రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకొంది. ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ (One Nation, One Election) సాధ్యాసాధ్యాల పరిశీలన నిమిత్తం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌  (Ram Nath Kovind) నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. వాస్తవానికి గతంలో ఈ రకంగా ఎన్నికలు జరిగినా వివిధ కారణాలతో మార్పులు చోటు చేసుకొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. విశాఖ ఎయిర్‌పోర్టులో అయ్యన్నపాత్రుడు అరెస్ట్

తెదేపా (TDP) సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu)ను పోలీసులు విశాఖపట్నంలో అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ నుంచి ఎయిరిండియా విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన్ను కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌ పోలీసులు మఫ్టీలో వచ్చి తీసుకెళ్లినట్లు సమాచారం. అనంతరం ఎలమంచిలి వద్ద 41ఏ నోటీసులు ఇచ్చి అయ్యన్నను విడిచిపెట్టారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అనుమానంతో భార్యను చంపి.. లొంగిపోయేందుకు వెళ్తూ..

భార్యను హతమార్చిన ఓ వ్యక్తి.. అక్కడికి కొద్దిసేపటిలోనే రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌ పట్టణానికి సమీపంలోని బంగారుగూడకు చెందిన అరుణ్‌కు నిజామాబాద్‌ జిల్లా బాల్కొండకు చెందిన దీపతో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అలిపిరి కాలినడక మార్గంలో మరో చిరుత సంచారం

అలిపిరి కాలినడక మార్గంలో మరో చిరుత సంచారం శ్రీవారి భక్తులను కలవరానికి గురిచేస్తోంది. కాలిబాటలో లక్ష్మీనరసింహ ఆలయం వద్ద చిరుత తిరుగుతున్న దృశ్యాలు ట్రాప్‌ కెమెరాల్లో నమోదయ్యాయి. ఇటీవల చిరుత దాడికి గురై మరణించిన చిన్నారి లక్షిత(6) మృతదేహం లభ్యమైన ప్రాంతంలోనే చిరుత సంచరించినట్లు అధికారులు తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రష్యాకు రామస్వామి ఆఫర్‌..!

 రిపబ్లికన్‌ పార్టీ తరపున అమెరికా (USA) అధ్యక్ష పదవి రేసులో నిలిచేందుకు పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) రష్యా (Russia) విషయంలో విభిన్న వైఖరిని ప్రకటించారు. అమెరికాకు ప్రధాన అడ్డంకిగా మారిన చైనా(China)ను ఎదుర్కొనే సమయంలో రష్యా చాలా కీలకమైందని ఆయన అభిప్రాయపడ్డారు. మాస్కోను ఎట్టి పరిస్థితుల్లో బీజింగ్‌ పక్షాన చేరనీయకూడదన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మీ పాలసీ ల్యాప్స్‌ అయ్యిందా? పునరుద్ధరణకు ఎల్‌ఐసీ అవకాశం!

జీవిత బీమా దిగ్గజ సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) 67వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ ప్రయాణంలో అద్భుతమైన విజయాలు సాధించినట్లు కంపెనీ తెలిపింది. వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సెప్టెంబరు 1 నుంచి విలువైన పాలసీదార్ల కోసం నిలిచిపోయిన (ల్యాప్స్‌డ్‌) పాలసీల పునరుద్ధరణ కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. 2022-23లో మొదటి ఏడాది ప్రీమియం ఆదాయంలో 62.58 శాతం మార్కెట్‌ వాటాతో పరిశ్రమలో అగ్రస్థానాన్ని ఎల్‌ఐసీ కొనసాగించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని