Commercial LPG Cylinder: వాణిజ్య సిలిండర్‌పైనా ధర తగ్గింపు

Commercial LPG Cylinder: ఇటీవలే గృహ వినియోగ సిలిండర్‌ ధరను కేంద్రం తగ్గించింది. తాజాగా వాణిజ్య సిలిండర్‌ ధరనూ తగ్గించాలని ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థలు నిర్ణయించాయి.

Updated : 01 Sep 2023 12:09 IST

దిల్లీ: వాణిజ్య వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర (Commercial LPG Cylinder Price)ను చమురు విక్రయ సంస్థలు తగ్గించాయి. రూ.19 కిలోల సిలిండర్‌ ధరపై రూ.158 తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించాయి. తాజా తగ్గింపుతో దేశ రాజధాని దిల్లీలో సిలిండర్‌ ధర (Commercial LPG Cylinder Price) రూ.1,522.50కు చేరింది. గృహ వినియోగ సిలిండర్‌పైన రూ.200 తగ్గిస్తూ కేంద్ర కేబినెట్‌ ఇటీవలే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఆగస్టులోనూ వాణిజ్య సిలిండర్‌ ధర (Commercial LPG Cylinder Price)ను ఓఎంసీలు రూ.99.75 తగ్గించాయి. జులైలో రూ.7 పెంచాయి. మే, జూన్‌ నెలలోనూ ధరల్ని రూ.172, రూ.83 చొప్పున తగ్గించాయి. మరోవైపు కేంద్రం ప్రభుత్వం ఎల్‌పీజీ దిగుమతులపై విధిస్తున్న వ్యవసాయ మౌలికవసతుల అభివృద్ధి సెస్‌ను పూర్తిగా తొలగించింది. సెప్టెంబరు 1 నుంచి 15 శాతం సెస్‌ ఉండబోదని తెలియజేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు