Teacher Transfers in Telangana: ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ ఖరారు

ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను విద్యాశాఖ ఖరారు చేసింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 3 నుంచి 5 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనుండగా.. 8, 9  తేదీల్లో సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు.

Updated : 01 Sep 2023 11:58 IST

హైదరాబాద్: ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను విద్యాశాఖ ఖరారు చేసింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబరు 3 నుంచి 5 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు తీసుకోనుండగా.. 8, 9 తేదీల్లో సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. గత మార్చిలో దరఖాస్తులు సమర్పించినవారు సైతం వివరాల్లో సవరణలు చేసుకోవచ్చు. గతంలో దరఖాస్తు చేయనివారు బదిలీ కోసం కొత్తగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫారం సమర్పించవచ్చు. 

3 నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు

ముఖ్య తేదీల వివరాలు ఇలా..

  • సెప్టెంబరు 12, 13 తేదీల్లో గ్రేడ్-2 హెచ్ఎంల బదిలీలకు వెబ్ ఆప్షన్లు. 
  • సెప్టెంబరు 15న గ్రేడ్-2 ప్రధాన ఉపాధ్యాయుల బదిలీలు. 
  • సెప్టెంబరు 17 నుంచి 19 వరకు స్కూల్ అసిస్టెంట్లకు హెచ్‌ఎంగా పదోన్నతులు. 
  • సెప్టెంబరు 20, 21 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ బదిలీలకు వెబ్ ఆప్షన్లు. 
  • సెప్టెంబరు 23, 24న స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు. 
  • సెప్టెంబరు 26 నుంచి 28న ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి. 
  • సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 1 వరకు ఎస్జీటీల బదిలీలకు వెబ్ ఆప్షన్లు. 
  • అక్టోబరు 3న ఎస్జీటీల బదిలీ. 
  • అక్టోబర్‌ 5 నుంచి 19 వరకు అప్పీళ్లకు అవకాశం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని