పాకిస్థానీయుల తిప్పలు.. రూ.300 మార్క్‌ దాటిన పెట్రోల్‌, డీజిల్‌

ఆకాశన్నంటుతోన్న ధరలతో పాకిస్థాన్(Pakistan) ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా పెరిగిన చమురు ధరలు ఆ భారాన్ని మరింత పెంచుతున్నాయి. 

Updated : 01 Sep 2023 16:17 IST

ఇస్లామాబాద్‌: పొరుగు దేశం పాకిస్థాన్(Pakistan) ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దాంతో ధరల భారం మోయలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా వారిపై మరో పిడుగు పడింది. పెట్రోల్‌(petrol), డీజిల్‌(diesel) ధరలు రూ.300 మార్క్‌ దాటేశాయి. పాక్‌ చరిత్రలో చమురు ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి.

పాకిస్థాన్‌(Pakistan) ఆర్థికమంత్రిత్వ శాఖ గురువారం సాయంత్రం చమురు ధరల పెంపుపై ప్రకటన చేసింది. రూ.14.91 పెరగడంతో లీటర్ పెట్రోల్‌ ధర రూ.305.36కు చేరింది. హైస్పీడ్ డీజిల్‌(HSD) ధర రూ.311.84కి ఎగబాకింది. హెఎస్‌డీ ధరను రూ.18.44 మేర పెంచడంతో ఈ మార్పు చోటుచేసుకుంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్‌ రూపాయి మారకం విలువ రూ.305.6గా ఉంది. కరెన్సీ విలువ భారీగా పతనమవుతుండటంతో సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచాల్సిన పరిస్థితి నెలకొంది.

అణు వ్యర్థ జలాలపై ఆందోళన వేళ.. సముద్రపు చేపను తిన్న జపాన్‌ ప్రధాని

పెరుగుతున్న విద్యుత్‌ బిల్లుల భారం మోయలేక ప్రజలు ఇటీవల దేశవ్యాప్తంగా పలుచోట్ల నిరసనకు దిగారు. తమ బిల్లుల్ని కాల్చివేశారు. పవర్‌ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అధికారులతో ఘర్షణకు దిగారు. ఈ సమస్య పరిష్కారానికి తాము ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్‌(Pakistan) అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇచ్చే రుణాలపైనే ఆధారపడుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని