Ayyannapatrudu: విశాఖ ఎయిర్‌పోర్టులో అయ్యన్నపాత్రుడు అరెస్ట్

తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడును పోలీసులు విశాఖపట్నంలో అరెస్ట్‌ చేశారు.

Updated : 01 Sep 2023 13:45 IST

విశాఖపట్నం: తెదేపా (TDP) సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu)ను పోలీసులు విశాఖపట్నంలో అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ నుంచి ఎయిరిండియా విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన్ను కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు మఫ్టీలో వచ్చి తీసుకెళ్లినట్లు సమాచారం. అనంతరం ఎలమంచిలి వద్ద 41ఏ నోటీసులు ఇచ్చి అయ్యన్నను విడిచిపెట్టారు.

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా ఇటీవల ఎన్టీఆర్‌ జిల్లా గన్నవరంలో నిర్వహించిన సభలో చేసిన వ్యాఖ్యలపై పలువురు తెదేపా నేతలపై కేసు నమోదైంది. వైకాపాకు చెందిన మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదుతో అయ్యన్నపాత్రుడుపై 153A, 354A1(4), 504, 505(2), 509 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసుల కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విశాఖలోని స్థానిక పోలీసులకు సమాచారం లేకుండానే ఎయిర్‌ పోర్టు నుంచి అయ్యన్నను తీసుకెళ్లి ఆ తర్వాత విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని