Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 07 Sep 2023 13:09 IST

1. భక్తులకు భరోసా కల్పించేందుకే ఊతకర్రలు: తితిదే ఛైర్మన్‌

శ్రీవారి భక్తుల భద్రత విషయంలో రాజీపడబోమని తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ‘ఆపరేషన్‌ చిరుత’ నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పారు. తాజాగా అలిపిరి నడకమార్గంలో బోనులో చిరుత చిక్కిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో కరుణాకర్‌రెడ్డి మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ట్రాఫిక్‌లో చిక్కుకున్న వరుడు.. ఆ తర్వాత పరిస్థితి చూడండి!

వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. మూడు భారీ క్రేన్‌లతో ఆయిల్ ట్యాంకర్ తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై వాహనాలను నిలిపివేశారు. దీంతో వరంగల్ నుంచి తొర్రూర్‌కు వెళ్తున్న ఓ వరుడి కారు ట్రాఫిక్‌లో చిక్కుకుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నిండు కుండలా కడెం జలాశయం

ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్టుల్లోకి వరదనీరు పోటెత్తుతోంది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రస్తుతం ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తి దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 696 అడుగులకు చేరింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆరో అంతస్తు పైనుంచి పడి ఇద్దరి మృతి..

నగరంలోని కేపీహెచ్‌బీ పరిధి అడ్డగుట్టలో విషాదం చోటుచేసుకుంది. భవన నిర్మాణ పనులు చేస్తుండగా పరంజి కూలి ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆరో అంతస్తులో పనులు చేస్తుండగా ఒక్కసారిగా పరంజి కూలిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వైకాపా నేత ఇంటి ముందు క్షుద్ర పూజలు!

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం చిన్నవారిగూడెంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. గ్రామానికి చెందిన వైకాపా నేత బండారు వెంకట సుబ్బారావు ఇంటి ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు తెలుస్తోంది. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, బొగ్గులు, కొబ్బరికాయ, పువ్వులు వంటివి పడవేసి వెళ్లారు. ఉదయాన్నే వీటిని చూసిన సుబ్బారావు కుటుంబసభ్యులు భయపడి తలుపులు వేసుకున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఒకే ఫ్రేమ్‌లో భూమి-చంద్రుడు.. ఆపై ఆదిత్య-ఎల్‌ 1 సెల్ఫీ..!

సూర్యుడిపై అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య-ఎల్‌ 1 (Aditya-L1) విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే భానుడి దిశగా పయనిస్తోన్న మన ఆదిత్య ఓ సారి పుడమి (Earth)ని చూసి మురిసి పోయింది. ఈ సమయంలోనే తొంగి చూస్తున్నట్లు చందమామ (Moon) కూడా కనిపించాడు. ఆ దృశ్యాన్ని క్లిక్‌ మనిపించి పనిలో పనిగా నేను క్షేమమే అన్నట్లు ఓ సెల్ఫీ కూడా తీసుకొని ఇస్రో (ISRO)కు పంపింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘భారత్‌’ కోసం అభ్యర్థన వస్తే.. దేశం పేరుపై ఐరాస ఏమందంటే..?

ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ (President of Bharat)’ పేరిట రాష్ట్రపతి నుంచి ఆహ్వానాలు రావడంతో దేశం పేరుపై రాజకీయ వివాదం మొదలైంది. దీనిపై తాజాగా ఐక్యరాజ్య సమితి (United Nations) కూడా స్పందించింది. తమ పేర్ల మార్పుపై దేశాల నుంచి అభ్యర్థనలు వస్తే.. ఐరాస వాటిని స్వీకరించి పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సీటులో కూర్చునేందుకు నిరాకరణ.. ప్రయాణికులను బయటకు పంపిన పైలట్‌!

టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానంలో తమకు కేటాయించిన సీట్లలో కూర్చునేందుకు నిరాకరించిన ఇద్దరు మహిళలను సిబ్బంది బయటకు పంపించారు. ‘ఎయిర్‌ కెనడా సంస్థ’ (Air Canada Flight)కు చెందిన విమానంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. జాబిల్లిపైకి దూసుకెళ్లిన జపాన్‌ ‘స్లిమ్‌’.. ల్యాండింగ్‌ ఎప్పుడంటే..?

జాబిల్లి (Moon)పై తొలిసారి అడుగుపెట్టాలన్న కలను సాకారం చేసుకునేందుకు జపాన్‌ (Japan) కీలక ప్రయోగం చేపట్టింది. పలుమార్లు వాయిదా పడిన ఈ రాకెట్‌ ప్రయోగం గురువారం ఉదయం విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేరింది. నైరుతి జపాన్‌లోని తనెగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి ఎక్స్‌-రే టెలిస్కోప్‌ (X-ray telescope), లూనార్‌ ల్యాండర్‌ (lunar lander)ను తీసుకొని హెచ్‌-2ఏ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘ప్రపంచకప్‌ తర్వాత ద్రవిడ్‌ను టెస్టుల్లో కోచ్‌గా కొనసాగించాలి’

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌ (World Cup 2023)నకు ఈ సారి భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మెగా టోర్నీ అక్టోబర్‌ 5న ప్రారంభమై నవంబర్‌ 19న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. వన్డే ప్రపంచకప్‌తో కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పదవీకాలం ముగుస్తుంది. ఈ టోర్నీ స్వదేశంలో జరుగుతుండటంతో భారత్‌ (Team India)పై భారీ అంచనాలున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని