Team India: ‘ప్రపంచకప్‌ తర్వాత ద్రవిడ్‌ను టెస్టుల్లో కోచ్‌గా కొనసాగించాలి’

వన్డే ప్రపంచకప్‌తో కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పదవీకాలం ముగుస్తుంది. వర్డల్ కప్ తర్వాత ద్రవిడ్‌ను టెస్టుల్లో కోచ్‌గా కొనసాగాలని బీసీసీఐ (BCCI) విజ్ఞప్తి చేయాలని బోర్డు మాజీ అధికారు ఒకరు అభిప్రాయపడ్డారు. 

Published : 07 Sep 2023 10:51 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌ (World Cup 2023)నకు ఈ సారి భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మెగా టోర్నీ అక్టోబర్‌ 5న ప్రారంభమై నవంబర్‌ 19న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. వన్డే ప్రపంచకప్‌తో కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పదవీకాలం ముగుస్తుంది. ఈ టోర్నీ స్వదేశంలో జరుగుతుండటంతో భారత్‌ (Team India)పై భారీ అంచనాలున్నాయి. ఒకవేళ టీమ్‌ఇండియా రాణించకపోతే.. విఫలమైన ఆటగాళ్లపై వేటువేయడంతోపాటు కొత్త కోచ్‌ను ఎంపిక చేసే అవకాశముంది. వీటన్నింటిని పట్టించుకోకుండా మరోసారి కోచ్‌గా పనిచేయాలని బీసీసీఐ కోరితే అప్పుడు ద్రవిడ్ స్పందన ఎలా ఉంటుందనే విషయం ఆసక్తికరంగా మారింది. అతడు సానుకూలంగా ఉంటే ప్రపంచ కప్‌ తర్వాత సౌతాఫ్రికా టూర్‌, స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లకు కోచ్‌గా కొనసాగొచ్చు. ఈ అంశంపై బీసీసీఐ మాజీ అధికారి ఒకరు స్పందించారు. 

కుల్‌దీప్‌ తిరిగొచ్చాడిలా..

 ‘‘టీమ్ఇండియా ప్రపంచకప్‌ టైటిల్‌ను అందుకుంటే కోచ్‌గా ద్రవిడ్ తన ప్రస్థానాన్ని ఉన్నతంగా ముగించాలనుకునే ఉద్దేశంతో కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించుకోకపోవచ్చు. కానీ, నా అభిప్రాయం ఏంటంటే ప్రపంచ కప్ తర్వాత బీసీసీఐ వేర్వేరు ఫార్మాట్‌లకు ప్రత్యేక కోచ్‌లను నియమించడంపై ఆలోచించాలి. ద్రవిడ్‌ను టెస్టుల్లో కోచ్‌గా కొనసాగాలని కోరాలి’’ అని సదరు మాజీ అధికారి బీసీసీఐకి సూచించారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌కు వేర్వేరు కోచ్‌లు ఉన్నారు. వన్డేలకు మాథ్యూ మోట్, టెస్టులకు బ్రెండన్‌ మెక్‌కల్లమ్ కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం భారత జట్టు ఆసియా కప్‌పై దృష్టిపెట్టింది. సూపర్‌-4కు చేరుకున్న రోహిత్‌ సేన.. సెప్టెంబరు 10న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మరోసారి తలపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని