Bhumana Karunakar Reddy: భక్తులకు భరోసా కల్పించేందుకే ఊతకర్రలు: తితిదే ఛైర్మన్‌ భూమన

శ్రీవారి భక్తుల భద్రత విషయంలో రాజీపడబోమని తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ‘ఆపరేషన్‌ చిరుత’ నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పారు. తాజాగా అలిపిరి నడకమార్గంలో బోనులో చిరుత చిక్కిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు.

Updated : 07 Sep 2023 09:13 IST

తిరుమల: శ్రీవారి భక్తుల భద్రత విషయంలో రాజీపడబోమని తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ‘ఆపరేషన్‌ చిరుత’ నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పారు. తాజాగా అలిపిరి నడకమార్గంలో బోనులో చిరుత చిక్కిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో కరుణాకర్‌రెడ్డి మాట్లాడారు.

‘‘రెండుసార్లు భక్తులపై దాడులు చేసిన నేపథ్యంలో ఐదు చిరుతలను బంధించాం. ‘ఆపరేషన్‌ చిరుత’ నిరంతరం కొనసాగుతుంది. అటవీశాఖకు చెందిన 300 మంది సిబ్బందిని భక్తుల భద్రతకు వినియోగిస్తున్నాం. భక్తులకు భరోసా కల్పించేందుకే ఊతకర్రలు పంపిణీ చేస్తున్నాం. ఈ నిర్ణయం తర్వాత నాలుగు చిరుతలను పట్టుకొన్నాం. మాపై విమర్శలు చేసినా భక్తుల భద్రతలో రాజీపడం’’ అని చెప్పారు. బోనులో చిక్కిన చిరుతను క్వారంటైన్‌కు తరలిస్తామని డీఎఫ్‌వో సతీశ్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని