Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 18 Jun 2023 17:00 IST

1. కాంగ్రెస్‌ నేతలు గాలిలో కోటలు నిర్మిస్తున్నారు: బండి సంజయ్‌

తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన విషయం మర్చిపోయి.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ నేతలు పగటి కలలు కంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. క్రైమ్‌, కరప్షన్‌ టీపీసీసీ కళంకిత రాజకీయ నాయకులు గాలిలో కోటలు నిర్మిస్తున్నారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ట్రైలర్‌లోనే కనిపిస్తుందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. జీపీఎస్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించం: సీపీఎస్‌ పోరాట సంఘాలు

ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీపీఎస్‌ విధానానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని లేదని సీపీఎస్‌ పోరాట సంఘాల నేతలు తేల్చి చెప్పారు. ఎన్నికల ముందు సీఎం జగన్‌ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పటి వరకు అన్ని ఉద్యోగ సంఘాలతో కలిసి ఐక్యపోరాటం చేస్తామన్నారు. జీపీఎస్‌ను స్వాగతించిన నేతలతో ఏ సీపీఎస్‌ ఉద్యోగీ లేరని నేతలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఐటీ దాడులు.. నా ఇమేజ్‌ని డ్యామేజీ చేసే ప్రయత్నమే: ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

తన పేరు మీద దక్షిణాఫ్రికాలో గనులున్నాయంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని భారాసకు చెందిన భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. వేరే ఉద్దేశంతోనే ఐటీ దాడులు నిర్వహించారని.. తన ఇమేజ్‌ని డ్యామేజీ చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. యాదాద్రి జిల్లా భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘నన్నెవరూ ఏమీ చేయలేరు’.. కావలిలో మహిళపై వైకాపా నేత దాష్టీకం

నెల్లూరు జిల్లా కావలిలో వైకాపా నేత రెచ్చిపోయాడు. అప్పు తీసుకున్న మహిళ వడ్డీ డబ్బులు ఇంకా చెల్లించాలంటూ నలుగురితో కలిసి జులుం ప్రదర్శించాడు. ‘నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. నీకు దిక్కున్న చోట చెప్పుకో’మని ఆమెపై దాడి చేయించాడు. అయితే, అప్పు తీసుకున్న డబ్బులకు వడ్డీతో సహా చెల్లించానని బాధిత మహిళ చెబుతుండడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. PSUల్లో రెండు లక్షల ఉద్యోగాలను తొలగించేశారు: రాహుల్‌

ప్రభుత్వ రంగ సంస్థ (PSU)ల్లో దాదాపు రెండు లక్షల ఉద్యోగాలను కేంద్రం తొలగించేసిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. తద్వారా లక్షలాది మంది యువత ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందని మండిపడ్డారు. కొంత మంది ఆశ్రిత పెట్టుబడిదారుల కోసమే భాజపా (BJP) ప్రభుత్వం ఇలా చేస్తోందని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘ఎమర్జెన్సీ’.. ఓ చీకటి యుగం: ప్రధాని మోదీ

దేశ చరిత్రలో ‘ఎమర్జెన్సీ’ కాలం చీకటి యుగమని ప్రధాని నరేంద్ర మోదీ  పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి మద్దతిచ్చే వారిపై అకృత్యాలు జరిగినట్లు గుర్తుచేశారు. ఆదివారం నిర్వహించిన మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది. ఇక్కడ రాజ్యాంగమే అత్యున్నతం. ప్రజాస్వామ్య విలువలు కలిగి ఉన్న ఈ దేశంలో ‘ఎమర్జెన్సీ’ విధించిన జూన్ 25వ తేదీని మనం మరచిపోలేం’ అని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వడగాలులతో బెంబేలు.. మూడు రోజుల్లో 98 మంది మృతి

దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో కొన్ని రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాదిన వడగాల్పుల (Heat Wave) ప్రభావం అధికంగా ఉంది. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతలకు అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గత మూడు రోజుల్లోనే వడదెబ్బ కారణంగా అక్కడ 54 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క బలియా జిల్లాలోనే గడిచిన 24 గంటల వ్యవధిలో 34 మంది చనిపోవడం కలవరపెడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కోకో ద్వీపంలో చైనా నిఘాపై మయన్మార్‌ను ప్రశ్నించిన భారత్‌

బంగాళఖాతంలో మయన్మార్‌(Myanmar)కు చెందిన కోకో ద్వీపం(Coco Island)లో చైనా(China) నిఘా కేంద్రం ఏర్పాటు చేయడంపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌ క్షిపణి ప్రయోగ కేంద్రమైన బాలేశ్వర్‌, వ్యూహాత్మక జలాంతర్గాములకు నివాసమైన వైజాగ్‌పై నిఘా పెట్టేందుకు చైనా ఇక్కడ ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొంది. ఈ విషయాన్ని భారత్‌ మయన్మార్‌ పాలకుల దృష్టికి తీసుకెళ్లింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మత్తులో ఉన్న మహిళను రూమ్‌కి తీసుకొచ్చి.. అత్యాచారం చేసి..!

భారత సంతతికి చెందిన ఓ విద్యార్థి ఇంగ్లాండ్‌లో (England) దారుణానికి ఒడిగట్టాడు. మద్యం మత్తులో ఉన్న ఓ మహిళను తన రూమ్‌కు తీసుకొచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడాది క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అరెస్టు చేయగా.. న్యాయస్థానం ఏడేళ్ల జైలుశిక్ష విధించినట్లు కార్డిఫ్‌ పోలీసులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇండోనేషియా ఓపెన్.. డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన తొలి భారత జంటగా రికార్డు

భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయి రాజ్‌ - చిరాగ్‌ శెట్టి (Satwik - chirag) అరుదైన ఘనత సాధించారు. సూపర్ -1000 ఈవెంట్‌లో డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన భారత జోడీగా రికార్డు సృష్టించారు. మలేషియా జోడీతో జరిగిన ఇండోనేషియా ఓపెన్ (Indonesia Open 2023) ఫైనల్‌లో  ఆరోన్ చియా - సో వుయిక్‌పై సాత్విక్ - చిరాగ్  వరుసగా రెండు సెట్లను 21-17, 21-18 తేడాతో విజయం సాధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని