Pailla Shekar Reddy: ఐటీ దాడులు.. నా ఇమేజ్‌ని డ్యామేజీ చేసే ప్రయత్నమే: ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

తన ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు జరిపిన సోదాలకు అన్ని విధాలుగా సహకరించానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తెలిపారు. తమ బంధువుల ఇళ్లలో సోదాలు జరిగాయని, కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు.

Updated : 18 Jun 2023 19:14 IST

భువనగిరి: తన పేరు మీద దక్షిణాఫ్రికాలో గనులున్నాయంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని భారాసకు చెందిన భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. వేరే ఉద్దేశంతోనే ఐటీ దాడులు నిర్వహించారని.. తన ఇమేజ్‌ని డ్యామేజీ చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. యాదాద్రి జిల్లా భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ఇల్లు, కార్యాలయాల్లో 3 రోజులు జరిగిన ఐటీ సోదాలకు అన్ని విధాలుగా అధికారులకు సహకరించానని తెలిపారు. తమ బంధువుల ఇళ్లలో ఎలాంటి ఐటీ సోదాలు జరగలేదని చెప్పారు. బంధువుల ఇళ్లలో కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు.

ఐటీ దాడుల అనంతరం తొలిసారి భువనగిరికి వచ్చిన ఎమ్మెల్యేకు పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్‌ నుంచి కార్యాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ డాక్టర్‌ జడల అమరేందర్ పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని