Satwik - Chirag: ఇండోనేషియా ఓపెన్.. డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన తొలి భారత జంటగా రికార్డు

ఇండోనేషియా ఓపెన్‌లో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు రికార్డు సృష్టించారు. ఫైనల్‌లో విజయం సాధించి తొలిసారి సూపర్ - 1000 ఈవెంట్‌లో టైటిల్‌ నెగ్గారు. 

Updated : 18 Jun 2023 16:20 IST

జకార్తా: భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయి రాజ్‌ - చిరాగ్‌ శెట్టి (Satwik - chirag) అరుదైన ఘనత సాధించారు. సూపర్ -1000 ఈవెంట్‌లో డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన భారత జోడీగా రికార్డు సృష్టించారు. మలేషియా జోడీతో జరిగిన ఇండోనేషియా ఓపెన్ (Indonesia Open 2023) ఫైనల్‌లో  ఆరోన్ చియా - సో వుయిక్‌పై సాత్విక్ - చిరాగ్  వరుసగా రెండు సెట్లను 21-17, 21-18 తేడాతో విజయం సాధించింది. ఇదే క్రమంలో వీరిద్దరికి కూడా ఇదే తొలి సూపర్ -1000 టైటిల్ కావడం విశేషం. 

పోటాపోటీగా జరిగిన ఫైనల్‌లో విజయం కోసం భారత్, మలేషియా ఆటగాళ్లు తీవ్రంగా పోరాడారు. ప్రస్తుతం డబుల్స్‌ ర్యాకింగ్స్‌లో సాత్విక్ - చిరాగ్‌ జోడీది ఆరో స్థానం. తమ ఛాంపియన్  ఆటను ప్రదర్శించిన వీరు మలేషియా జోడీ ఒత్తిడికి ఏమాత్రం తలొగ్గకుండా విజయం సాధించారు. ఇప్పటికే వీరి ఖాతాలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, థామస్ కప్, కామన్వెల్త్‌ గేమ్స్‌ మెడల్స్‌ ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని