Coco Islands: కోకో ద్వీపంలో చైనా నిఘాపై మయన్మార్‌ను ప్రశ్నించిన భారత్‌

కోకో ద్వీపంలో చైనా కార్యకలాపాలు పెరగడంపై భారత్‌ మయన్మార్‌ వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు అక్కడ చైనా ఎటువంటి కార్యకలాపాలను జరపడంలేదంటూ మయన్మార్‌ సైనిక పాలకులు వెల్లడించినట్లు తెలిసింది. 

Updated : 18 Jun 2023 17:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బంగాళఖాతంలో మయన్మార్‌(Myanmar)కు చెందిన కోకో ద్వీపం(Coco Island)లో చైనా(China) నిఘా కేంద్రం ఏర్పాటు చేయడంపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌ క్షిపణి ప్రయోగ కేంద్రమైన బాలేశ్వర్‌, వ్యూహాత్మక జలాంతర్గాములకు నివాసమైన వైజాగ్‌పై నిఘా పెట్టేందుకు చైనా ఇక్కడ ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొంది. ఈ విషయాన్ని భారత్‌ మయన్మార్‌ పాలకుల దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై మయన్మార్‌ వివరణ సంతృప్తికరంగా లేనట్లు తెలుస్తోంది. భారత్‌ ఆరోపణలను మయన్మార్‌ సైనిక పాలకులు తేలిగ్గా కొట్టిపారేశారు.. ఈ ద్వీపంలో విమానాల రన్‌వే పొడిగింపులో చైనా పాత్ర ఏమాత్రం లేదని పేర్కొన్నారు. 

 మరోవైపు భారత భద్రతా సంస్థలకు వచ్చిన సమాచారం ప్రకారం అక్కడ రవాణా విమానాల రాకపోకలకు వీలుగా రన్‌వే అభివృద్ధి చేసినట్లు తెలిసింది.  దాదాపు 1500 మంది వర్కర్లు ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఉపగ్రహ చిత్రాల్లో కోకో దీవుల దక్షిణ కొనపై కొత్తగా ఒక కాజ్‌వే, వసతి సముదాయం తదితరాలను నిర్మిస్తున్నట్టు తేలింది. రన్‌వే, రాడార్‌ స్టేషన్‌కు సమీపంలోనే ఇవన్నీ ఉన్నాయి. భారత యుద్ధనౌకల కదలికలను క్షుణ్ణంగా గమనించడమే ఈ స్థావరం ఉద్దేశం. ఈ పరిణామం భారత్‌కు ఆందోళనకరమే. 

 2021లో తిరుగుబాటు తర్వాత అంతర్జాతీయంగా ఏకాకి కావడంతో మయన్మార్‌ సైనిక పాలకులు పూర్తిగా చైనాపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో చైనా కూడా 4 బిలియన్‌ డాలర్లు మయన్మార్‌కు సర్దుబాటు చేసింది. దీంతోపాటు బీఆర్‌ఐ ప్రాజెక్టులోకి చేర్చుకొనేందుకు యత్నించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని