Vijayawada: జీపీఎస్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించం: సీపీఎస్‌ పోరాట సంఘాలు

ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీపీఎస్‌ విధానానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొనేది లేదని సీపీఎస్‌ పోరాట సంఘాల నేతలు తేల్చి చెప్పారు. ఎన్నికల ముందు సీఎం జగన్‌ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated : 18 Jun 2023 14:49 IST

విజయవాడ: ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీపీఎస్‌ విధానానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని లేదని సీపీఎస్‌ పోరాట సంఘాల నేతలు తేల్చి చెప్పారు. ఎన్నికల ముందు సీఎం జగన్‌ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పటి వరకు అన్ని ఉద్యోగ సంఘాలతో కలిసి ఐక్యపోరాటం చేస్తామన్నారు. జీపీఎస్‌ను స్వాగతించిన నేతలతో ఏ సీపీఎస్‌ ఉద్యోగీ లేరని నేతలు తెలిపారు.  జేఏసీ నేతలు స్వార్థం కోసం పనిచేస్తున్నారని ఆక్షేపించారు. ఈ మేరకు పోరాట కార్యాచరణను ఆయా సంఘాలు ప్రకటించాయి. 

ఎన్నికల ముందు జగన్‌ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేయాలని ఏపీ సీపీఎస్‌ఈఏ గౌరవ కార్యదర్శి బాజీ పఠాన్‌ డిమాండ్‌ చేశారు. ఈనెల 19, 26 తేదీల్లో సీపీఎస్‌పై ‘స్పందన’లో రెఫరెండం నిర్వహణకు నిర్ణయించినట్లు తెలిపారు. జులై 8న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. ప్రభుత్వానికి జేఏసీ నేతలు భజన చేస్తున్నారని బాజీ పఠాన్‌ ఆరోపించారు. జేఏసీ నేతలకు ముందుగా జీపీఎస్‌ను పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అది విజయవంతమైతే మిగిలిన ఉద్యోగులకు అమలు చేయాలని సూచించారు. 

ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల ఐకాస ఛైర్మన్‌

అనేక సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నామని.. కానీ క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం తమను వెన్నుపోటు పొడించిందని ఒప్పంద, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 6,667 మంది ఒప్పంద ఉద్యోగులను మాత్రమే క్రమబద్ధీకరించడం అన్యాయమని పొరుగుసేవలు, ఒప్పంద ఉద్యోగుల ఐకాస ఛైర్మన్‌ నాగేశ్వరరావు అన్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. మంత్రి బొత్స వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే చలో విజయవాడకు తాము సిద్ధమని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని