Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 19 Jun 2023 16:57 IST

1. ఉపాధ్యాయులకు బోధన తప్ప మరో పని చెప్పబోం: మంత్రి బొత్స

రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు బోధన తప్ప మరో పని చెప్పబోమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విద్యా కానుక కిట్ల పంపిణీ వారంలో పూర్తి చేస్తామని చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యా వ్యవస్థలో మార్పులపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించామని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలను ఉపాధ్యాయ సంఘాలకు వివరించామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మహేశ్వరానికి వైద్య కళాశాల మంజూరు చేస్తాం: సీఎం కేసీఆర్‌

రాష్ట్రంలో పచ్చదనం పెరిగేందుకు 8 ఏళ్లుగా కృషి చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. హరితహారం అంటే కాంగ్రెస్ నేతలు జోకులు వేశారని.. ఇప్పుడు అదే కార్యక్రమంతో తెలంగాణలో 7.7 శాతం పచ్చదనం పెరిగిందని చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తుమ్మలూరులో ఏర్పాటు చేసిన హరితోత్సవ సభలో కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. శ్రీవాణి ట్రస్టు నిధులతో 2,445 నూతన ఆలయాల నిర్మాణం: తితిదే ఛైర్మన్‌

శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంతో 2,445 నూతన ఆలయాల నిర్మాణం చేపడతామని తితిదే ఛైర్మన్‌ వై.వి. సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో తితిదే ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశ తీర్మానాలను తితిదే ఛైర్మన్‌ మీడియాకు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. జగన్‌ మాట కంటే మంత్రి గన్‌మెన్‌ మాటే చెల్లుతోంది: ఆరుద్ర ఆవేదన

సీఎం జగన్‌ తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ కాకినాడ జిల్లాకు చెందిన మహిళ ఆరుద్ర నిరాహార దీక్షకు దిగారు. విశాఖలోని జీవీఎంసీ కార్యాలయం వద్ద ఆమె దీక్షకు కూర్చొన్నారు. ఆమెకు దివ్యాంగుల హక్కుల పోరాట సమితి మద్దతు పలికింది. ఈ సందర్భంగా ఆరుద్ర మాట్లాడుతూ దివ్యాంగురాలైన తన కుమార్తె సాయిచంద్రకు వైద్యసహాయం అందించాలని కోరారు. పోలీసుల తీరు వల్లే తన బిడ్డకు ఈ దుస్థితి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. విద్యార్థులకు శుభవార్త.. అమెరికా వీసా స్లాట్లు విడుదల

అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించేందుకు (Education in US) సిద్ధమయ్యేవారికి ఊరట కలిగించే విషయం. ఎంతోకాలంగా వేచి చూస్తున్న విద్యార్థి వీసా (ఎఫ్‌-1) ఇంటర్వ్యూల అపాయింట్‌మెంట్‌ స్లాట్లు విడుదలయ్యాయి. జులై నుంచి ఆగస్టు మధ్య కాలానికి ప్రస్తుతం ఇవి అందుబాటులో ఉన్నాయని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. ustraveldocs.com సందర్శించి అపాయింట్‌మెంట్లను బుక్‌ చేసుకోవచ్చని సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పెళ్లి పీటలపై నుంచి వధువును లాక్కెళ్లిన పోలీసులు..

సినిమాల్లో పెళ్లి సీన్లలో సరిగ్గా మూడుముళ్లు వేసే సమయానికి ‘ఆపండి’ అనే డైలాగ్‌ వింటుంటాం. కేరళ (Kerala)లోని ఓ వివాహ వేడుకలో సరిగ్గా ఇలాంటి సీనే కన్పించింది. వధువు (Bride) మెడలో వరుడు (Groom) తాళికట్టడానికి కొద్ది క్షణాల ముందు మండపంలోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. వధువును బలవంతంగా పీటలపై నుంచి లాక్కెళ్లి కోర్టుకు తీసుకెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఉపగ్రహ ప్రయోగ వైఫల్యం.. ఓ పెద్ద లోపం: ఉత్తరకొరియా

తమ తొలి ఉపగ్రహ ప్రయోగ వైఫల్యం ఓ పెద్ద లోపమని ఉత్తరకొరియా కీలక అధికారులు పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లోనే మరో సారి ప్రయోగం చేపడతామని వారు వెల్లడించినట్లు ఆ దేశ అధికారిక మీడియా కేసీఎన్‌ఏ వెల్లడించింది. ఉత్తర కొరియాలోని వర్కర్స్‌పార్టీ పార్టీ మూడు రోజులపాటు నిర్వహించిన సమావేశం ఆదివారం ముగిసింది. శక్తిమంతమైన అణ్వాయుధాల తయారీని మరింత వేగవంతం చేస్తామని కిమ్‌జోంగ్‌ ఉన్‌, ఆయన సీనియర్‌ అధికారులు ఈ సమావేశంలో ప్రతిజ్ఞ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఇంటి అద్దె భరించలేక విమానంలో ఉద్యోగానికి.. అవాక్కయిన నెటిజన్లు

ఖరీదైన ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయాల్సి వచ్చినప్పుడు అక్కడి ఇంటి అద్దెలు భరించడం చాలా కష్టం. అందుకే, చాలా మంది కష్టమైన సరే.. రెంట్‌ తక్కువగా ఉంటుందని సుదూర ప్రాంతాల నుంచి ఆఫీసులకు వెళ్తుంటారు. బండి మీదో, బస్సులోనే గంటల తరబడి ట్రాఫిక్‌ను దాటుకుంటూ విధులకు చేరుకుంటారు. అయితే, అమెరికా (USA)లో ఓ అమ్మాయి మాత్రం ఇంటి అద్దెలు భరించలేక.. వందల మైళ్లు ప్రయాణం చేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అవే నా ప్రాణాలను కాపాడాయి: ఎలాన్‌ మస్క్‌

ఆధునిక ఔషధాలు కలిగి ఉండడం నేటి ప్రపంచం చేసుకున్న గొప్ప అదృష్టమని టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ( Elon Musk) అన్నారు. అవే తనను మలేరియా (Malaria) నుంచి రక్షించాయని ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి ఆయన తల్లి మే మస్క్ స్పందించారు. ఎలాన్‌ మస్క్‌ ( Elon Musk) మలేరియా బారిన పడిన నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. జెలెన్‌స్కీకి భారతీయ ‘బర్ఫీ’.. రుచి చూపించిన సునాక్‌..!

భారతీయ రుచులు.. అందులోనూ మిఠాయిల (Indian Sweets)కు ఎంతో పేరుంది! ఇటీవల ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky)కి మన ‘బర్ఫీ (Barfi)’ రుచి చూపించారట బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak). ఓ ఇంటర్వ్యూలో సునాక్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. తన తల్లి తయారు చేసిన ఈ మిఠాయిలను జెలెన్‌స్కీతో పంచుకున్నానని, ఇది తెలుసుకుని ఆమె ఎంతో ఉద్వేగానికి గురయ్యారని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని