Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 23 Jun 2023 17:17 IST

1. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మరో గుడ్‌న్యూస్‌

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. విభాగాల వారీగా ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చే అలవెన్స్‌ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల ప్రకారం ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రావెలింగ్‌ అండ్‌ కన్వీయన్స్‌, సెలవు రోజుల్లో ఉద్యోగులకు, ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే అడ్వాన్స్‌.. ఇలా పలు రకాల అలవెన్స్‌లను పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అలిపిరి నడక మార్గంలో చిరుత దాడి.. తితిదే కీలక నిర్ణయాలు

అలిపిరి నడక మార్గంలో ఏడోమైలు వద్ద బాలుడిపై చిరుత దాడి చేసిన నేపథ్యంలో తితిదే కీలక నిర్ణయాలు తీసుకుంది. చిరుత దాడి చేసిన ప్రాంతాన్ని శుక్రవారం తితిదే ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దాడి చేసింది పిల్ల చిరుత కావడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పిందన్నారు. దాడి జరిగిన సమయంలో భక్తులు పెద్దగా అరవడం, రిపీటర్‌ స్టేషన్‌ నుంచి లైట్లు వేయడంతో చిరుత బాలుడిని వదిలేసి వెళ్లి పోయిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. 9ఏళ్లుగా కేంద్రాన్ని కోరుతూనే ఉన్నాం.. ఇప్పటికీ ఒప్పుకోలేదు: కేటీఆర్‌

తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి పోతే 40పైసలే తిరిగి వస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. దిల్లీ పర్యటనలో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎదుగుతున్న రాష్ట్రానికి సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కేంద్రమే చెబుతోంది. సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌ భూముల గురించి కేంద్రానికి ఎన్నోసార్లు కోరామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అదంతా ఓ ఫొటో సెషన్‌.. విపక్షాల భేటీపై అమిత్‌ షా వ్యంగ్యాస్త్రాలు

బిహార్‌(Bihar) రాజధాని పట్నాలో శుక్రవారం జరుగుతోన్న విపక్షాల భేటీ(Opposition meet)పై భాజపా(BJP) నేతలు విమర్శలు గుప్పించారు. అదొక ఫొటో సెషన్ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఎద్దేవా చేశారు. ‘ఈ రోజు పట్నాలో ఫొటో సెషన్ జరుగుతోంది. వారు ప్రధాని మోదీ, ఎన్‌డీఏను సవాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. 2024లో కూడా మోదీనే ప్రధాని అవుతారు’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రాజకీయాల్లో నేడు విచిత్రాలు జరుగుతున్నాయి.. జేపీ నడ్డా

బిహార్‌ రాజధాని పట్నాలో విపక్ష పార్టీలు భేటీ(opposition meeting) కావడంపై  భాజపా(BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) స్పందించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో జైలుకు వెళ్లిన నేతలే ఇప్పుడు ఆమె మనవడు రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)కి ఆహ్వానం పలుకుతున్నారని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అలా అయితేనే స్వయం సమృద్ధి భారత్‌ సాధ్యం: గడ్కరీ

సామాజిక ఆర్థిక అసమానతలకు స్వస్తి చెబితేనే ‘స్వయం సమృద్ధి భారత్‌ (Atmanirbhar Bharat)’ సాధ్యమని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) అన్నారు. వ్యవసాయ, గ్రామీణ, గిరిజన రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని తెలిపారు. జీడీపీలో వీటి వాటా ప్రస్తుతం ఉన్నదానితో పోలిస్తే రెట్టింపు కావాల్సిన అవసరం ఉందన్నారు. 2020లో కేంద్ర ప్రభుత్వం ‘స్వయం సమృద్ధి భారత్‌’ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. 2050 నాటికి 130 కోట్ల మందికి డయాబెటిస్‌!

మధుమేహంతో బాధపడుతున్న వారికి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి రెట్టింపు అవుతుందని పరిశోధకులు తెలిపారు. ఫలితంగా లక్షలాది మందికి ప్రమాదకర రుగ్మతల ముప్పు పెరగనుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా  2021లో 52.9 కోట్ల మంది డయాబెటిస్‌ (Diabetes) బాధితులు ఉన్నారని లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురితమైన కథనంలో పరిశోధకులు తెలిపారు. ఈ సంఖ్య 2050 నాటికి 130 కోట్లు దాటుతుందని అంచనా వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. విమానంలో ‘హైజాకింగ్‌’ మాట కలకలం.. ప్రయాణికుడి అరెస్టు!

విమానం బయల్దేరే సమయంలో ఓ వ్యక్తి మాట్లాడిన మాటలు కలకలం సృష్టించాయి. హైజాకింగ్‌ (Hijacking) అంటూ అతడు ఫోన్‌లో మాట్లాడటం.. సిబ్బందిని పరుగులు పెట్టించింది. వెంటనే భద్రతాబలగాలు రంగంలోకి దిగి అతడిని అదుపులోకి తీసుకున్నాయి. అధికారుల వివరాల ప్రకారం.. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం (Mumbai Airport) నుంచి గురువారం రాత్రి దిల్లీకి ఓ విస్తారా (Vistara) విమానం బయల్దేరేందుకు సిద్ధమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. టైటాన్ ప్రయాణం.. విషాదాంతమైందిలా!

టానిక్‌ (Titanic) శిథిలాల సందర్శనకు కొందరు ఔత్సాహికులు చేసిన సాహసం విషాదాంతమైంది. కొన్ని గంటల్లోనే తిరిగి వస్తామని భావించిన ఆ ప్రయాణికుల కల చెదిరిపోయింది. వేల అడుగుల లోతులోకి వెళ్లిన ఐదుగురు సాహసప్రియులు.. జలాంతర్గామి విచ్ఛిన్నం కావడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. క్యాన్సర్‌ నిర్ధారణ.. తోటలో కుమార్తెతో సహా దంపతుల ఆత్మహత్య

అనారోగ్య సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు.. కుమార్తెతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  కొత్తకారాయగూడేనికి చెందిన పోట్రు కృష్ణయ్య (40), సుహాసిని (35)లకు అమృత (19) అనే కుమార్తె ఉంది. సుహాసినికి నెలన్నర క్రితం కృష్ణా జిల్లా తిరువూరులో గర్భసంచికి శస్త్రచికిత్స చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని