Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 24 Jun 2023 21:08 IST

1. పట్టణ పేదలకు ఉపాధి హామీ తరహా స్కీమ్‌: కేంద్రమంత్రికి KTR వినతి

గ్రామీణ ఉపాధి హామీ తరహాలో పట్టణ పేదలకూ ఓ పథకం ఉండాలని తెలంగాణ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రాబోయే బడ్జెట్‌లో ఇందు కోసం ఓ పథకాన్ని ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు. దిల్లీలో రెండో రోజు పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీతో శనివారం జరిగిన భేటీలో ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందించాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఈ ఏడాది 2లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు: మంత్రి నిరంజన్‌రెడ్డి

వరిలో స్వల్పకాలిక వంగడాలు సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి సూచించారు. రైతులకు ఈ వానాకాలంలో సాగు చేయాల్సిన పంటల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు అందజేయాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితులు, వానాకాలం పంటల సాగు, విత్తనాల లభ్యత, ఎరువుల సరఫరా, ఆయిల్ పామ్ సాగుపై ఉన్నతాధికారులతో సచివాలయంలో మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. విపక్షాల భేటీ.. ప్రయోజనమేంటి?: ఉదయ్‌ సామంత్‌

తాజా పరిస్థితులను చూస్తుంటే శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) తన భావజాలంతో రాజీపడి ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకించిన వారి పక్కనే కూర్చున్నారని మహారాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి ఉదయ్‌ సామంత్‌ (Uday Samant) విమర్శించారు. ఒకరోజు ప్రధానిని చేస్తే ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తానన్నది ‘బాలాసాహెబ్‌ ఠాక్రే’ కలని ఆయన అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కేదార్‌నాథ్‌ ‘బంగారు తాపడం’పై ప్రత్యేక కమిటీ

ఇటీవల కేదార్‌నాథ్‌ ఆలయానికి చెందిన పూజారి బంగారు తాపడం చేసే ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, రూ.125 కోట్లు కుంభకోణం జరిగిందని సోషల్‌ మీడియాలో విమర్శలు చేయడం సంచలనం సృష్టించింది. దీనిపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఈజిప్టు చేరుకున్న మోదీ.. 26 ఏళ్ల తర్వాత ఆ దేశానికి మన ప్రధాని!

విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఈజిప్టు (Egypt)కు చేరుకున్నారు. మూడు రోజుల అమెరికా (America) అధికారిక పర్యటన అనంతరం ప్రధాని మోదీ.. కైరోకు పయనమైన విషయం తెలిసిందే. స్థానిక విమానాశ్రయంలో మోదీకి ఈజిప్టు ప్రధాని ముస్తఫా మద్‌బౌలీ (Mostafa Madbouly) ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ ఈజిప్టు సేనల గౌరవ వందనం స్వీకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పూర్తిస్థాయిలో బలహీనంగా రష్యా.. ఎంత ఆలస్యమైతే అంత నాశనం!

ఉక్రెయిన్‌పై సైనిక చర్య కొనసాగిస్తోన్న రష్యాకు.. అదే యుద్ధంలో సహకరించిన వాగ్నర్‌ గ్రూప్‌ తిరుగుబాటు రూపంలో షాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. వ్యక్తిగత లబ్ధి కోసమే వాగ్నర్ చీఫ్‌ ప్రిగోజిన్‌ రష్యాకు ద్రోహం చేస్తున్నాడని పుతిన్‌ ఇప్పటికే మండిపడ్డారు. మరోవైపు.. రష్యాలో జరుగుతోన్న పరిణామాలపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వం.. భారత్‌కు అమెరికా మద్దతు

అణు సరఫరాదారుల సమూహం (న్యూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూప్‌-NSG)లో భారత్‌ చేరేందుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని అమెరికా (USA) పునరుద్ఘాటించింది. ఈ విషయంలో భావసారూప్యత కలిగిన భాగస్వాములతో కలిసి వెళ్లేందుకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. ప్రధాని మోదీ అమెరికా పర్యటన తర్వాత అమెరికా తన నిర్ణయాన్ని వెల్లడించడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘మేం లొంగిపోం.. త్వరలో రష్యాకు కొత్త అధ్యక్షుడు వస్తారు’: ప్రిగోజిన్ వ్యాఖ్యలు

వాగ్నర్ గ్రూప్‌ తిరుగుబాటుతో ప్రస్తుతం రష్యాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఆ గ్రూప్‌ అధిపతి ప్రిగోజిన్(yevgeny Prigozhin) రష్యా ప్రజలను వెన్నుపోటు పొడిచారంటూ అధ్యక్షుడు పుతిన్‌ తీవ్రంగా మండిపడ్డారు. తమ విషయంలో పుతిన్ పొరబడ్డారని, తాము దేశభక్తులమని ప్రిగోజిన్‌ అన్నారు. అలాగే ఈ దేశానికి కొత్త అధ్యక్షుడు వస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మీ ఫోనే ఇక థర్మా మీటర్‌.. కొత్త యాప్‌ వస్తోంది!

ఒకప్పుడు ఫోన్‌ కాల్స్‌కే పరిమితమైన ఫోన్‌.. ఇప్పుడు మనం నిత్యం వాడే ఎన్నో గ్యాడ్జెట్స్‌ను రీప్లేస్‌ చేసేసింది. ఇప్పుడు వాచ్‌ చూడాలన్నా స్మార్ట్‌ఫోనే.. అలారమ్‌ మోగాలన్నా స్మార్ట్‌ఫోనే.. వినోదం కావాలన్నా స్మార్ట్‌ఫోన్‌నే చూడాల్సిన పరిస్థితి. త్వరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ (Smartphone) జ్వరాన్ని కొలిచేందుకు ఉపయోగించే థర్మామీటర్‌ (thermometer) అవతారాన్నీ ఎత్తనుంది. దీనికి సంబంధించి ఓ యాప్‌ రూపుదిద్దుకుంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మొబైల్‌ డేటా+ Jiosaavn ప్రో సబ్‌స్క్రిప్షన్‌.. జియో ప్లాన్లు ఇవే..

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Jio) కొత్తగా మ్యూజిక్‌ లవర్స్‌ కోసం ఇటీవల జియో సావన్‌ ప్రో (JioSaavn Pro) సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన కొన్ని ప్రీపెయిడ్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. మొబైల్‌ డేటా, కాల్స్‌, ఎస్సెమ్మెస్‌ వంటి ఇతర సదుపాయాలూ ఇందులో ఉన్నాయి. డైలీ 2 జీబీ డేటా పరిమితితో రెండు ప్లాన్లు తీసుకురాగా.. 1.5జీబీ డేటాతో మూడు ప్లాన్లు కలిపి మొత్తం ఐదు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని