మొబైల్‌ డేటా+ Jiosaavn ప్రో సబ్‌స్క్రిప్షన్‌.. జియో ప్లాన్లు ఇవే..

Jio plans with JioSaavn Pro Subscription: జియో సావన్‌ సబ్‌స్క్రిప్షన్‌తో రిలయన్స్‌ ఇటీవల కొన్ని ప్రీపెయిడ్‌ ప్లాన్లు తీసుకొచ్చింది. ఇందులో 2జీబీ, 1.5జీబీ రోజువారీ డేటా అందించే ప్లాన్లు ఉన్నాయి.

Updated : 24 Jun 2023 17:50 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Jio) కొత్తగా మ్యూజిక్‌ లవర్స్‌ కోసం ఇటీవల జియో సావన్‌ ప్రో (JioSaavn Pro) సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన కొన్ని ప్రీపెయిడ్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. మొబైల్‌ డేటా, కాల్స్‌, ఎస్సెమ్మెస్‌ వంటి ఇతర సదుపాయాలూ ఇందులో ఉన్నాయి. డైలీ 2 జీబీ డేటా పరిమితితో రెండు ప్లాన్లు తీసుకురాగా.. 1.5జీబీ డేటాతో మూడు ప్లాన్లు కలిపి మొత్తం ఐదు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఆ ప్లాన్ల వివరాలు ఇవీ..

2జీబీ డేటా ప్లాన్స్‌..

రిలయన్స్‌ జియో తీసుకొచ్చిన కొత్త ప్లాన్లలో రూ.589 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ ఒకటి. ఇది 56 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 2జీబీ చొప్పున డేటా వినియోగించుకోవచ్చు. అపరిమిత కాల్స్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లతో పాటు జియో సావన్‌ మ్యూజిక్‌ యాప్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా లభిస్తుంది. అపరిమిత మ్యూజిక్‌తో పాటు పాటలను డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ వంటి యాప్స్‌ను వినియోగించుకోవచ్చు.

జియో అందిస్తున్న మరో ప్లాన్‌ ధర రూ.789. ఇది 84 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. ఇందులోనూ డైలీ 2జీబీ డేటా, అపరిమిత కాల్స్‌, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. జియో సావన్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉంటుంది. ఇందులోనూ జియో యాప్స్‌ను వినియోగించుకోవచ్చు.

1.5 జీబీ డేటాతో..

ఇవి కాకుండా 28 రోజుల వ్యాలిడిటీతో రూ.269 ప్లాన్‌ (రోజుకు 1.5జీబీ డేటా), 56 రోజుల వ్యాలిడిటీతో రూ.529 ప్లాన్‌, 84 రోజుల వ్యాలిడిటీతో రూ.739 ప్లాన్లను జియో కొత్తగా తీసుకొచ్చింది. వీటిలోనూ జియో సావన్‌ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా అందిస్తోంది. 2జీబీ ప్లాన్లలో ఉండే ఇతర ప్రయోజనాలూ ఇందులో ఉన్నాయి. ఈ ప్లాన్లు ఎంచుకునే వారు 5జీ నెట్‌వర్క్‌ పరిధిలో ఉండి 5జీ ఫోన్‌ వాడుతుంటే అపరిమిత 5జీ డేటాను ఉచితంగా పొందొచ్చు. విడిగా మ్యూజిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకునే వారికి ఈ ప్లాన్లు ఉపయోగపడతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని