Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తల

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 23 Jul 2023 17:16 IST

1. మంత్రి వేణుపై పిల్లి సుభాష్‌ కీలక వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో రామచంద్రపురం టికెట్‌పై వైకాపా సీనియర్‌ నేత, ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు మళ్లీ టికెట్‌ ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని స్పష్టం చేశారు. మమ్మల్ని.. వేణు చెప్పు కింద బతికే వాళ్లం అనుకుంటున్నారా?అని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మైనారిటీలకు రూ.లక్ష ఆర్థికసాయం.. ఉత్తర్వులు జారీ

రాష్ట్రంలో బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ రూ.లక్ష ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందివ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారదోలాలనే దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. బైజూస్‌ కాంట్రాక్టుపై పవన్‌ ప్రశ్నల వర్షం

నష్టాల్లో ఉన్న బైజూస్‌ కంపెనీకి రూ.కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారని ట్విటర్‌ వేదికగా నిన్న ఆరోపణలు చేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌..  ఇవాళ మరికొన్ని ప్రశ్నలు సంధించారు. ‘‘బైజూస్‌ కంటెంట్‌ కోసం వచ్చే ఏడాది నుంచి ఖర్చు ఎవరు భరిస్తారు? కంపెనీ వారు ప్రతి ఏడాది ఉచితంగా ఇస్తారా? ఈ విషయంలో క్లారిటీ లోపించింది’’ అని ట్వీట్‌ చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మరో మూడు రోజులు భారీ వర్షాలు

రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఈ రెండు రోజులు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. టీఆర్‌టీ ఇవ్వకుంటే ప్రగతిభవన్‌ను ముట్టడిద్దాం: ఎంపీ కోమటిరెడ్డి

ఓట్ల కోసం పథకాల పేరుతో ప్రజలను మోసం చేసే సీఎం కేసీఆర్‌కు నిరుద్యోగుల బాధ‌లు పట్టవా?అని కాంగ్రెస్‌ నేత, భువనగిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి (KomatiReddy VenkatReddy) ప్రశ్నించారు. ఎంపీ కోమటిరెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టు (టీఆర్‌టీ) అభ్యర్థులు కలిశారు. ఏళ్లు గ‌డుస్తున్నా టీఆర్‌టీ నోటిఫికేషన్‌ ఇవ్వడం లేద‌ని ఎంపీకి వివ‌రించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మద్యం మత్తులో బార్‌కు నిప్పు.. 11 మంది మృతి

మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన పని 11 మంది ప్రాణాలను బలిగొంది. మెక్సికోలోని సోనోరా (Sonora) రాష్ట్రంలోని శాన్‌ లూయిస్‌ రియో కొలరాడో (San Luis Rio Colorado) నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బార్‌కు వెళ్లిన ఓ వ్యక్తి పీకలదాకా మద్యం తాగాడు. అనంతరం బార్‌లోని మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో.. బార్‌ భద్రతా సిబ్బంది అతన్ని బయటకు పంపించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ట్రయల్స్‌లో ఒలింపియన్‌ రవి దహియాకు షాక్‌..!

ఒలింపిక్‌ రజత పతక విజేత రవి దహియకు భారీ షాక్‌ తగిలింది. ఆసియా క్రీడల కోసం నిర్వహించిన ఎంపికల్లో  ఓటమి పాలయ్యాడు. యవ రెజ్లర్‌ అతిష్‌ తోడ్కర్‌ అతడిని ఓడించాడు. ఇందిరాగాంధీ స్టేడియంలో 57 కేజీల విభాగంలో ఆదివారం ఉదయం జరిగిన బౌట్‌లో తోడ్కర్‌  విజయం అందుకొన్నాడు. టెక్నిక్‌, శక్తిలో దహియాను రెజ్లింగ్‌ సర్కిల్స్‌ ఓ యంత్రంగా అభివర్ణిస్తారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చాక్లెట్ల దొంగకు 18 నెలల జైలు శిక్ష

చాక్లెట్లు దొంగతనం చేసినందుకు ఓ వ్యక్తికి న్యాయస్థానం 18 నెలల జైలుశిక్ష విధించింది. అదేంటి ఆమాత్రం దానికి అంత పెద్దశిక్ష ఏంటి అనుకుంటున్నారా? ఆ వ్యక్తి దొంగిలించినవి ఒకట్రెండు కాదు.. ఏకంగా 2 లక్షల చాక్లెట్లు వాటి విలువ దాదాపు రూ.42 లక్షలు ఉంటుందని అంచనా. ఈ ఘటన బ్రిటన్‌లో జరిగింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నియంత్రణ లేకుంటే.. యూఎస్‌ నుంచే కొవిడ్‌ తరహా మహమ్మారి!

చైనాలో పుట్టినట్లు భావిస్తోన్న కొవిడ్‌-19 మహమ్మారి (Covid Pandemic) యావత్‌ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన విషయం తెలిసిందే. దీన్నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నప్పటికీ.. మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆకాశంలో తొలి పుట్టినరోజు..

తన మొదటి పుట్టిన రోజున విమానంలో ప్రయాణిస్తున్న చిన్నారికి ఇండిగో (Indigo Airlines) విమానయాన సంస్థ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. విమానంలోనే ఆ చిన్నారి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించింది. దాంతో ప్రయాణికులంతా చప్పట్లతో బేబీకి శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి సంబంధించిన వీడియోను చిన్నారి తండ్రి జోయెల్‌ లాల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా.. అది వైరల్‌గా మారింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని