Ravi Dahiya: ట్రయల్స్‌లో ఒలింపియన్‌ రవి దహియాకు షాక్‌..!

ఒలింపిక్‌ పతక విజేత రవి దహియా ఆసియా క్రీడలకు నిర్వహిస్తున్న ట్రయల్స్‌లో అనూహ్యంగా ఓటిమి పాలయ్యాడు.  

Published : 23 Jul 2023 15:01 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఒలింపిక్‌ రజత పతక విజేత రవి దహియకు భారీ షాక్‌ తగిలింది. ఆసియా క్రీడల కోసం నిర్వహించిన ఎంపికల్లో  ఓటమి పాలయ్యాడు. యవ రెజ్లర్‌ అతిష్‌ తోడ్కర్‌ అతడిని ఓడించాడు. ఇందిరాగాంధీ స్టేడియంలో 57 కేజీల విభాగంలో ఆదివారం ఉదయం జరిగిన బౌట్‌లో తోడ్కర్‌  విజయం అందుకొన్నాడు. టెక్నిక్‌, శక్తిలో దహియాను రెజ్లింగ్‌ సర్కిల్స్‌ ఓ యంత్రంగా అభివర్ణిస్తారు. అటువంటి రవిని మహారాష్ట్ర నుంచి వచ్చిన తోడ్కర్‌ ఓడిస్తాడని ఎవరూ ఊహించలేదు. 

పాక్‌ను కొట్టి కప్‌ పట్టాలని..

దహియాతో తలపడితే.. అతడి నుంచి రెండు పాయిట్లు సాధించడం కూడా కష్టమేనని అతడి ఆటతీరు తెలిసిన నిపుణులు చెబుతారు. అలాంటిది.. గెలుపుపై పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందే. కానీ, ఆదివారం జరిగిన ట్రైయల్స్‌లోతోడ్కర్‌ అలవోకగా పాయింట్లు సాధించడాడు. 20-8 పాయింట్లతో  మ్యాచ్‌ గెలిచే సమయానికి  లీడింగ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో దహియా గాయంతో బాధపడుతూనే బరిలోకి దిగినట్లు భావిస్తున్నారు. ఈ ఏడాది అతడు ఏసీఎల్‌, ఎంసీఎల్‌ గాయాలతో బాధపడుతున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని