First Birthday : ఆకాశంలో తొలి పుట్టినరోజు.. ఆ చిన్నారికి విమానం జీవితాంతం గుర్తుండిపోతుంది!

ఇండిగో విమానంలో ఓ చిన్నారి తొలి పుట్టినరోజు (Birthday) వేడుకలు జరిగాయి. ఆ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

Published : 23 Jul 2023 15:37 IST

Image : Joel lal j

కొచ్చి : తన మొదటి పుట్టిన రోజున విమానంలో ప్రయాణిస్తున్న చిన్నారికి ఇండిగో (Indigo Airlines) విమానయాన సంస్థ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. విమానంలోనే ఆ చిన్నారి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించింది. దాంతో ప్రయాణికులంతా చప్పట్లతో బేబీకి శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి సంబంధించిన వీడియోను చిన్నారి తండ్రి జోయెల్‌ లాల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా.. అది వైరల్‌గా మారింది.

ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న బ్యూలా లాల్‌ అనే పాప మొదటి పుట్టిన రోజని సిబ్బందికి తెలిసింది. దాంతో కెప్టెన్‌ వెంటనే మైక్‌ అందుకున్నారు. ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌.. దయచేసి వినండి. నేను మీ కెప్టెన్‌ అగస్టీన్. ఇప్పుడు అది ముఖ్యం కాదు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇవాళ మనతోపాటు ఓ పాప ప్రయాణిస్తోంది. ఆమె మొదటి పుట్టినరోజు నేడు. అందుకే కేక్‌ కట్‌ చేస్తున్నాం. అందరికీ పంచిపెడతాం’ అంటూ ప్రకటన చేశాడు. దాంతో విమానంలోని ప్రయాణికులంతా పాపకు అభినందనలు తెలిపారు.

మణిపుర్‌ క్రీడాకారులకు అండగా తమిళనాడు ప్రభుత్వం

ఈ వీడియో షేర్‌ చేసిన అతి స్వల్పకాలంలోనే నెటిజన్ల నుంచి విశేష స్పందన లభించింది. దానికి దాదాపు 10 లక్షల వ్యూస్‌ వచ్చాయి. ‘చాలా మంచిది. మీరు ఈ వీడియోలో ఆ అనంద క్షణాలను పంచుకోవడం చాలా బాగుందని’ ఓ నెటిజన్‌ కామెంట్ చేశాడు. ‘అది అద్భుతమైన పని. చిన్నారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ మరో నెటిజన్‌ పేర్కొన్నాడు. కేరళలోని కొచ్చి విమానంలో దిగగానే పాపతో ఇండిగో సిబ్బంది చాక్లెట్ కేక్‌ కట్ చేయించారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని