Viral news: చాక్లెట్ల దొంగకు 18 నెలల జైలు శిక్ష

చాక్లెట్లు దొంగతనం చేసిన ఓ వ్యక్తికి బ్రిటన్‌ న్యాయస్థానం 18 నెలల జైలు శిక్ష విధించింది

Updated : 23 Jul 2023 16:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చాక్లెట్లు దొంగతనం చేసినందుకు ఓ వ్యక్తికి న్యాయస్థానం 18 నెలల జైలుశిక్ష విధించింది. అదేంటి ఆమాత్రం దానికి అంత పెద్దశిక్ష ఏంటి అనుకుంటున్నారా? ఆ వ్యక్తి దొంగిలించినవి ఒకట్రెండు కాదు.. ఏకంగా 2 లక్షల చాక్లెట్లు వాటి విలువ దాదాపు రూ.42 లక్షలు ఉంటుందని అంచనా. ఈ ఘటన బ్రిటన్‌లో జరిగింది. అక్కడి మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 11న జోబే పూల్‌ అనే వ్యక్తి స్టఫోర్డ్‌ పార్క్ ఏరియాలోని ఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ లాజిస్టిక్స్‌ పరిశ్రమకు చెందిన ఓ యూనిట్‌లోకి అక్రమంగా చొరబడి.. చాక్లెట్లు ఉన్న పెద్ద పెట్టెను తన వాహనంలోకి తీసుకొని వెళ్లిపోయాడు.

కొద్ది దూరంలో చెక్‌పాయింట్‌ను కూడా దాటేశాడు. కానీ, అనుమానం వచ్చిన పోలీసులు అతడి వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టగా దాదాపు ఆరు నెలల తర్వాత తాజాగా అతడికి న్యాయస్థానం 18 నెలల జైలు శిక్ష విధించింది. ఇప్పటి వరకు పోలీసు కస్టడీలో ఉన్న సమయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అంతేకాకుండా చివరి 9 నెలలపాటు జైలులో ఉండకుండా సంబంధిత అధికారుల అనుమతి తెచ్చుకోవచ్చని నేరస్తుడికి సూచించింది.

నియంత్రణ లేకుంటే.. యూఎస్‌ నుంచే కొవిడ్‌ తరహా మహమ్మారి!

మరోవైపు వాదన సమయంలో జోబే పూల్‌ తరఫు న్యాయవాది వాదనలు భిన్నంగా ఉన్నాయి. జోబే పూల్‌ను పోలీసులు పట్టుకోలేదని, దొంగతనం చేసిన తర్వాత తనను పోలీసులు అనుసరిస్తున్నారని తెలుసుకొని అతడే వాహనాన్ని నిలిపేసి వారి ఎదుట లొంగిపోయాడని ఆయన చెప్పుకొచ్చారు. అందువల్ల శిక్ష తగ్గించాలని కోర్టును కోరారు. కానీ, ఈ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ కేసుకు సంబంధించి విషయాలను వెస్ట్‌మెర్సియా పోలీసులు ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘క్రీమ్‌ ఎగ్‌ ఫ్యాన్స్‌’కు వెస్ట్‌మెర్సియా పోలీసులు ఎంతో సాయం చేశారు. 2 లక్షల క్రీమ్‌ఎగ్‌ చాక్లెట్లను దొంగ బారి నుంచి కాపాడారు.’’ అంటూ రాసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని