Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 23 May 2024 16:59 IST

1. ‘పాలే లేవు .. నెయ్యి కోసం కొట్లాట’: విపక్ష కూటమిపై మోదీ ఎద్దేవా

సార్వత్రిక ఎన్నికల సమరం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ప్రధాని మోదీ (Modi) విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. విపక్ష ‘ఇండియా’ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆయన హరియాణాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. పూర్తి కథనం

2. ఐఐటీల్లోనూ ఉద్యోగ సంక్షోభం.. 38%మందికి దక్కని కొలువులు!

మన దేశంలో ఐఐటీలకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఈ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదివితే చాలు..  మంచి కంపెనీల్లో ఉద్యోగాలు, రూ.లక్షల్లో వేతన ప్యాకేజీల్లాంటి మాటల్నే తరచూ వింటూ ఉంటాం. కానీ, ప్రస్తుతం నిరుద్యోగం పెరగడంతో అందుకు భిన్నమైన పరిస్థితులు వెలుగుచూస్తున్నాయి. పూర్తి కథనం

3. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల్లో ఒకే ఒక హామీ అమలైంది: హరీశ్‌రావు

 కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల్లో ఒకే ఒక హామీ అమలైందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ కూడా తుస్సేనని ఎద్దేవా చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆయన హనుమకొండలో ప్రసగించారు. ‘ఉపాధ్యాయ ఉద్యోగులకు నాలుగు డీఏలు ఇవ్వకుండా కాంగ్రెస్‌ మోసం చేసింది.పూర్తి కథనం

4. పిన్నెల్లి పరారీ.. పోలీసుల అసమర్థతకు నిదర్శనం: ప్రత్తిపాటి

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీ పోలీసుల అసమర్థతకు నిదర్శనమని తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. నిందితులకే పోలీసులు పహారా కాస్తారని మరోసారి నిరూపించారన్నారు. వివేకా హత్య కేసు నిందితుడు అవినాష్‌ను ఇలానే దగ్గరుండి కాపాడారని ఆరోపించారు.పూర్తి కథనం

5. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీలోకి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌?

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (Sensex) సూచీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (AEL) చోటు దక్కించుకునే అవకాశాలు బలంగా ఉన్నాయని ఐఐఎఫ్‌ఎల్‌ ఆల్టర్నేటివ్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. సూచీ అర్ధవార్షిక పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా విప్రో స్థానంలో అదానీ కంపెనీ వచ్చి చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. పూర్తి కథనం

6. తెలంగాణ జిల్లాల్లో రెండు రోజులపాటు వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. శనివారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30- 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి.పూర్తి కథనం

7. దీపికా పదుకొణె బేబీ బంప్‌పై ట్రోలింగ్‌.. వైరలవుతోన్న జర్నలిస్ట్‌ పోస్ట్‌

స్టార్‌ హీరోయిన్ దీపికా పదుకొణె త్వరలోనే తల్లి కానున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆమె తన భర్త రణ్‌వీర్‌తో కలిసి ఓటు వేయడానికి వచ్చారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే, కొందరు నెటిజన్లు దీపికా (Deepika Padukone) బేబీ బంప్‌పై ట్రోలింగ్‌ చేస్తూ నెగెటివ్‌ కామెంట్స్ పెట్టారు.  పూర్తి కథనం

8. చిమ్మచీకట్లో నైట్‌ విజన్‌ గాగుల్స్‌తో.. వాయుసేన అరుదైన ఫీట్‌

భారత వాయుసేన (IAF) మరో అరుదైన ఫీట్ సాధించింది. నైట్ విజన్ గాగుల్స్‌(NVG) సాయంతో తూర్పు సెక్టార్‌లో ట్రాన్స్‌పోర్టు విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసింది. C-130J విమానం అధునాతన ల్యాండింగ్‌ గ్రౌండ్‌లో దిగిందని వాయుసేన ఎక్స్ వేదికగా వెల్లడించింది.పూర్తి కథనం

9. పన్నూ హత్యకు కుట్ర కేసు : చెక్‌ కోర్టులో నిఖిల్‌ గుప్తాకు ఎదురుదెబ్బ..!

ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ (Gurpatwant Singh Pannun) హత్యకు జరిగిన కుట్ర కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకొన్నాయి. దీనిలో ప్రధాన నిందితుడిగా ఉన్న భారతీయుడు నిఖిల్‌ గుప్తాను అమెరికాకు అప్పగించేందుకు చెక్‌ రాజ్యాంగ కోర్టు అంగీకారం తెలిపింది. పూర్తి కథనం

10. ఎన్నికలపై రిషి సునాక్‌ ప్రకటన.. సతీమణి అక్షతా మూర్తి పోస్ట్‌ వైరల్‌

 బ్రిటన్‌ (UK General Elections) పౌరులు జులై 4న తమ దేశానికి కొత్త ప్రధానిని ఎన్నుకోనున్నారు. దీనిపై ప్రస్తుత ప్రధానమంత్రి రిషి సునాక్‌ (Rishi Sunak) బుధవారం అనూహ్య ప్రకటన చేసి ఆశ్చర్యపర్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిషి సతీమణి అక్షతా మూర్తి (Akshata Murty) తాజాగా సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్‌ చేశారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని