icon icon icon
icon icon icon

Harish Rao: భాజపా మాట నమ్మితే నీళ్లు లేని బావిలో దూకినట్లే: హరీశ్‌రావు

భారాస హయాంలో మెదక్‌కు రైలు తీసుకువచ్చినట్లు మాజీ మంత్రి, భారాస నేత హరీశ్‌రావు అన్నారు.

Published : 25 Apr 2024 14:14 IST

మెదక్‌: భారాస హయాంలో మెదక్‌కు రైలు తీసుకువచ్చినట్లు మాజీ మంత్రి, భారాస నేత హరీశ్‌రావు అన్నారు. మెదక్‌లో నిర్వహించిన భారాస ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ‘‘మా ప్రభుత్వంలో మంజీరాపై చెక్‌డ్యామ్‌లు కట్టినందునే పంటలు ఎండిపోలేదు. ఈ ప్రాంతానికి మూడు మెడికల్‌ కళాశాలలు తీసుకువచ్చాం. వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్‌ నేతలు బాండ్‌ పేపర్‌ రాసిచ్చారు. గతంలో బాండ్‌ పేపర్‌కు విలువ ఉండేది.. సీఎం రేవంత్‌ మోసంతో దాని విలువ పోయింది.

ప్రజలు నమ్మడం లేదని ఎక్కడికెళ్తే అక్కడి దేవుళ్లపై ఒట్టు పెడుతున్నారు. రేవంత్‌.. ఆగస్టు 15 లోపు రుణమాఫీ, ఆరు హామీలు అమలు చేయాలి. కేంద్రంలో భాజపా పాలనలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెరిగాయి. ఏ ఒక్క వర్గానికీ మేలు చేయలేదు. పేదల గురించి భాజపా ఎప్పుడూ ఆలోచించలేదు. ఆ పార్టీ మాట నమ్మితే నీళ్లు లేని బావిలో దూకినట్లే’’ అని హరీశ్‌రావు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img