icon icon icon
icon icon icon

YS Sharmila: దేశంలో ఏపీ తప్ప రాజధాని లేని రాష్ట్రం ఉందా?: షర్మిల

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

Published : 25 Apr 2024 15:15 IST

విజయవాడ: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. పోలవరం పూర్తి, రాజధాని నిర్మాణం సహా అన్ని సమస్యలకూ కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే పరిష్కారం లభిస్తుందని చెప్పారు. కులమతాలకు అతీతంగా అందరినీ అక్కునే చేర్చుకునే పార్టీ తమదన్నారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలోని కృష్ణలంక రాణిగారితోటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. దేశంలో ఏపీ తప్ప రాజధాని లేని రాష్ట్రం ఉందా? అని ప్రశ్నించారు. వాషింగ్టన్‌ డీసీని మించిన రాజధానిని కడతానని చెప్పిన జగన్‌.. కట్టారా? అని నిలదీశారు. వైకాపా పాలనతో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని.. పరిశ్రమలు రాలేదన్నారు. ఈ పరిస్థితులతో యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. అభివృద్ధి విషయంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. మాయమాటలతో కాకుండా మంచి చేసేవాళ్లకు ప్రజలు ఓట్లేయాలని షర్మిల పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img