icon icon icon
icon icon icon

Andhra news: ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది.

Published : 25 Apr 2024 15:31 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. గురువారం మధ్యాహ్నం 3గంటలతో లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల కు నామినేషన్ల గడువు ముగిసిందని అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు 731 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 175 శాసనసభ నియోజకవర్గాలకు 4,210 మంది నామినేషన్లు వేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈనెల 29 నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు. కొన్ని చోట్ల చెదురు మదురు ఘటనలు మినహా నామినేషన్ల  స్వీకరణ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.  మే 13న పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 4న ఫలితాలు వెల్లడిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img