Top 10 News @ 5 Pm: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 02 Jul 2023 16:58 IST

1. AP ECET Results: ఏపీ ఈసెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

ఏపీ ఈసెట్‌ ఫలితాలు(AP ECET Results 2023) విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆదివారం సాయంత్రం ఉన్నత విద్యామండలి అధికారులు విడుదల చేశారు. పాలిటెక్నిక్‌, బీఎస్సీ (గణితం) పూర్తిచేసిన విద్యార్థులకు ఈసెట్‌లో సాధించిన ర్యాంకుల ఆధారంగా బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. ఫలితాల కోసం క్లిక్ చేయండి

2. Khammam CP: కాంగ్రెస్‌ సభకు అడ్డంకులు సృష్టిస్తున్నారనడం అవాస్తవం: ఖమ్మం సీపీ

కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న జనగర్జన సభకు ఎలాంటి అడ్డంకులు సృష్టించడంలేదని ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌ తెలిపారు. సభకు వెళ్తున్న వారి వాహనాలు అడ్డకుంటున్నామన్న వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. ట్రాఫిక్‌ డైవర్షన్‌ మినహా ఎక్కడా చెక్‌ పోస్టులు పెట్టలేదని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ‘మహా’ రాజకీయాల్లో మరో కుదుపు.. మంత్రిగా అజిత్‌ పవార్‌ ప్రమాణం

మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీలో విపక్షనేతగా ఉన్న నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత అజిత్‌ పవార్‌ అధికార  పక్షంలో చేరారు. ముఖ్యమంత్రి శిందేతో భేటీ అనంతరం.. తన మద్దతుదారులు 9 మందితో కలిసి గవర్నర్‌ను కలిశారు. వెనువెంటనే మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. YSRCP: ‘పిలిచి అవమానించొద్దు’.. వైకాపా ఎమ్మెల్యే తీరుపై ఎంపీపీ అసహనం

అధికారిక కార్యక్రమాలకు పిలిచి అవమానిస్తున్నారని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును, అధికారులను తెదేపా (TDP) ఎంపీపీ అంబటి భూలక్ష్మి, సర్పంచ్ బొండాడ నాగమణి నిలదీశారు. కోనసీమ జిల్లా పి.గన్నవరంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా.. అధికారిక కార్యక్రమాల్లో వైకాపా (YSRCP) కార్యకర్తలకు ఇచ్చిన విలువ కూడా తమకు ఇవ్వకుండా కించపరుస్తున్నారని ఎంపీపీ, సర్పంచ్ వాపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. Eknath Sindhe: ఇప్పుడు ట్రిపుల్‌ ఇంజిన్‌ సర్కార్‌.. అజిత్‌ చేరికపై సీఎం శిందే కామెంట్స్‌

మహారాష్ట్రలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్సీపీ సీనియర్‌ నేత, మాజీ డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ఈరోజు మధ్యాహ్నం ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. ఎన్సీపీకి చెందిన అజిత్‌ పవార్‌ వర్గం తమ కూటమి(భాజపా, శివసేన)తో కలవడంపట్ల సీఎం ఏక్‌నాథ్‌ శిందే హర్షం ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. Twitter: ట్వీట్స్ లిమిట్‌పై మీమ్స్‌ హల్‌చల్‌..

ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ (Twitter)లో ఇకపై పోస్టులను వీక్షించటంపై తాత్కాలిక పరిమితులు తీసుకొచ్చినట్లు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ప్రకటించారు. శనివారం రోజున ట్విటర్‌లో ఏర్పడిన అంతరాయంపై ఆయన ట్వీట్‌ చేశారు. వెరిఫైడ్​, అన్​వెరిఫైడ్​, కొత్త అన్​వెరిఫైడ్ ఖాతాదారులకు వేర్వేరుగా లిమిట్‌ ఇచ్చారు. మస్క్ నిర్ణయంపై తమదైన శైలిలో మీమ్స్‌ క్రియేట్‌ చేసి, నెట్టింట పోస్ట్‌ చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. IND vs PAK: సచిన్‌ వికెట్‌ కోసం రెండు ఫ్రేమ్‌లు కట్‌ చేశారు: పాక్‌ మాజీ స్పిన్నర్

భారత్ -  పాకిస్థాన్‌ (IND vs PAK) జట్ల మధ్య మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) టోర్నీల్లో పాక్‌పై భారత్‌దే ఆధిక్యం. అయితే, ఆ మ్యాచ్‌ సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్‌ ఎల్బీపై నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. పాక్‌ మాజీ  స్పిన్నర్ సయీద్‌ అజ్మల్ మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇప్పటికీ ఆ నిర్ణయం సరైంది కాదనే వాదిస్తున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. Mayor marriage with crocodile: మొసలితో మేయర్‌ పెళ్లి.. ఎందుకో తెలుసా!

సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వర్షాల కోసం లేదా పంటలు బాగా పండటం కోసం ప్రార్థిస్తూ విభిన్న ఆచారాలు పాటిస్తారు. ఓ ప్రాంతంలో మాత్రం ప్రజలంతా కలిసి పట్టణ మేయర్‌కు వివాహం జరిపించడం వారి సంప్రదాయం. ఆ వివాహం మహిళతో కాదండోయ్‌.. ఒక ఆడ మొసలితో..! దక్షిణ మెక్సికోలోని  శాన్ పెడ్రో హువామెలులా అనే పట్టణంలోనిది ఈ సంప్రదాయం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. Titan: ఆశతో వెళ్లాం.. శకలాలే దొరికాయి..! తీవ్ర భావోద్వేగానికి గురైన రెస్క్యూ టీం లీడర్‌

అట్లాంటిక్‌ మహాసముద్రంలో టైటానిక్‌ శిథిలాల సందర్శనకు వెళ్లిన ‘టైటాన్‌’ మినీ జలాంతర్గామి కథ విషాదాంతమైన విషయం తెలిసిందే. యాత్ర నిర్వహించిన ‘ఓషన్‌గేట్‌’ సీఈవో సహా ఐదుగురు మృతి చెందారు. ఈ క్రమంలోనే ‘రెస్క్యూ మిషన్‌’ సాగిన తీరును మీడియాకు వివరిస్తూ.. పెలాజిక్‌ సీఈవో, రెస్క్యూ బృందానికి నాయకత్వం వహించిన ఎడ్‌ కసానో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. America : అమెరికాలో ప్రజలకు డబ్బులు పంచే రాష్ట్రం.. ఒక్కో వ్యక్తికి వెయ్యి డాలర్లు!

అమెరికాలోని అతిపెద్ద రాష్ట్రం వెంట్రుకల ఎగుమతి, చేపల పెంపకం, బంగారు నిక్షేపాల తవ్వకం, చమురు వెలికితీత ద్వారా ఈ రాష్ట్రం ఆదాయాన్ని గడిస్తోంది. ప్రధానంగా చమురు ద్వారా ఈ రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వస్తోంది. అయితే చమురు పరిమిత వనరు కావడంతో ఎప్పుడో ఒకసారి ఆ నిల్వలు నిండుకోవడం ఖాయమని భావించి రాష్ట్రంలో ఒక నిధి ఏర్పాటు చేశారు.ఏంటా నిధి?పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని