Khammam CP: కాంగ్రెస్‌ సభకు అడ్డంకులు సృష్టిస్తున్నారనడం అవాస్తవం: ఖమ్మం సీపీ

కాంగ్రెస్‌ సభకు వచ్చే వాహనాలను అడ్డుకుంటున్నామని జరుగుతున్న ప్రచారం అవాస్తమని ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌ తెలిపారు. 

Updated : 02 Jul 2023 15:55 IST

ఖమ్మం: కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న జనగర్జన సభకు ఎలాంటి అడ్డంకులు సృష్టించడంలేదని ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌ తెలిపారు. సభకు వెళ్తున్న వారి వాహనాలు అడ్డకుంటున్నామన్న వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. ట్రాఫిక్‌ డైవర్షన్‌ మినహా ఎక్కడా చెక్‌ పోస్టులు పెట్టలేదని తెలిపారు. సభకు వచ్చే వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారని సామాజిక మాధ్యమాల్లో అసత్య ఆరోపణలు చేయొద్దని సీపీ విజ్ఞప్తి చేశారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అంతకముందు ఖమ్మం సభకు వచ్చే వాహనాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. గ్రామాల నుంచి సభకు వచ్చే వాహనాలతోపాటు, కార్యకర్తలను రావివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మం సభకు వస్తున్న వాహనాలను అడ్డుకోకుండా ఆదేశాలివ్వాలని రేవంత్‌ రెడ్డి డీజీపీని కోరారు. రేవంత్‌ అభ్యర్థనపై స్పందించిన డీజీపీ అంజనీ కుమార్‌.. ఖమ్మంలో కాంగ్రెస్‌ సభకు వెళ్లే వాహనాలను అడ్డుకోకుండా ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు