Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 01 May 2023 21:00 IST

1. కార్మికులకు గుడ్‌న్యూస్‌.. సీఎం కేసీఆర్‌ మే డే కానుక

తెలంగాణలో పారిశుద్ధ్య, ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మే డే కానుక ప్రకటించారు. పారిశుద్ధ్య, ఆర్టీసీ కార్మికుల వేతనాలు పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు నూతన సచివాలయంలో జిల్లాల మంత్రులు, నేతలు, నీటిపారుదల శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో వేతనాలు పెంచుతూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆదేశాలు అమలు చేయకపోతే జైలుకు పంపుతాం.. విద్యాశాఖ అధికారులకు హైకోర్టు వార్నింగ్‌

ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో 25 శాతం కోటా కింద ప్రవేశం కల్పించిన విద్యార్థుల జాబితా ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోతే జైలుకు పంపుతామని హెచ్చరించింది. ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో పేద విద్యార్థులకు ఉచితంగా 25శాతం సీట్లు కేటాయించాలని 2022లో హైకోర్టు తీర్పు వెలువరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ ఆదేశాలు అమలు చేయట్లేదని ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాది యోగేశ్‌ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డీఏ మంజూరు

ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. 2022 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డీఏ బకాయిలను మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులకు డీఏ, పింఛనర్లకు 2.73 శాతం డీఆర్‌ మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2023 జూన్‌ 1 నుంచి కొత్త డీఏను జీతంతో కలిపి ఇస్తామని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వైజాగ్‌ నుంచి 44 ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు.. వివరాలివే..!

వేసవి కాలం(Summer season)లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే(South central Railway) కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ (Visakhapatnam) నుంచి పలు నగరాలకు సర్వీసులందించే 44 వీక్లీ ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగిస్తున్నట్టు తెలిపింది.  విశాఖపట్నం నుంచి మహబూబ్‌నగర్‌, తిరుపతి, బెంగళూరు నగరాల మధ్య రాకపోకలు సాగించే ఈ ప్రత్యేక సర్వీసులను పొడిగిస్తున్నట్టు ట్వీట్‌ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఎంఎస్ ధోనీకిదే చివరి సీజనా..? స్టీఫెన్ ఫ్లెమింగ్‌ కీలక వ్యాఖ్యలు

ఐపీఎల్‌ 2023వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) ప్లే ఆఫ్స్‌ రేసులో ఉంది. కెప్టెన్ కూల్‌ ఎంఎస్ ధోనీ (MS Dhoni) నాయకత్వంలో సీఎస్‌కే ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరికీ తలెత్తే అనుమానం.. వచ్చే సీజన్‌లో ధోనీ ఆడతాడా..? లేకపోతే ఇదే చివరి సీజనా..?. ఎందుకంటే ప్రస్తుత సీజన్‌లోనే మోకాలి నొప్పితో బాధపడుతూనే జట్టును నడిపిస్తున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు..!

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో (GST collections) సరికొత్త రికార్డు నమోదైంది. ఏప్రిల్‌ నెలకు గానూ రూ.1.87 లక్షల కోట్లు వసూళ్లు జరిగాయి. గతేడాది ఏప్రిల్‌లో రూ.1.68 లక్షల కోట్లతో పోలిస్తే వసూళ్లు 12 శాతం మేర వృద్ధి నమోదైంది.  జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో వసూళ్లు నమోదు కావడం ఇదే తొలిసారి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రాజీనామా చేస్తానన్న బ్రిజ్‌ భూషణ్‌.. ప్రధానికి ట్యాగ్‌ చేసిన ప్రియాంక

లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా స్టార్‌ రెజ్లర్లు గత కొద్దిరోజులుగా నిరసన చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైంది. అయితే ఆయన రాజీనామా చేయాలని రెజ్లర్లు కోరుతున్నారు. అయితే ప్రధాని మోదీ, ఇతర అగ్రనేతలు కోరితే తాను రాజీనామా చేస్తానని బ్రిజ్‌ భూషణ్‌ అన్నట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కర్ణాటకలో కాంగ్రెస్‌ కొత్త నినాదం.. #CryPMPayCM హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు

కన్నడ నాట ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాజకీయ విమర్శల వేడి పెరుగుతోంది. రెండు జాతీయ పార్టీలైన భాజపా- కాంగ్రెస్ మధ్యే ప్రధానంగా సాగుతున్న ఈ పోరులో.. ఇప్పటికే జాతీయ నాయకులు రంగంలోకి దిగి ప్రచారాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. మోదీనుద్దేశించి ఖర్గే వ్యాఖ్యలు చేయడం.. కాంగ్రెస్‌ తనను 91 సార్లు దూషించిందంటూ ప్రధాని విమర్శలు చేయడంతో ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక తాజాగా తిప్పికొట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కేంద్రం అభ్యర్థన.. ‘రాజద్రోహ చట్టం’పై విచారణ మరింత ఆలస్యం

రాజద్రోహ చట్టం (Sedition Law)పై విచారణను సర్వోన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ చట్టం పునఃపరిశీలనపై చర్చలు కీలక దశలో ఉన్నాయని, పూర్తి చేసేందుకు మరింత గడువు ఇవ్వాలని కేంద్రం కోరడంతో సుప్రీంకోర్టు (Supreme Court) అంగీకరించింది. భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్‌ 124ఎ నిబంధనపై కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్ష ప్రక్రియ ప్రారంభించిందని కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ ఆర్‌. వెంకటరమణి సుప్రీంకోర్టుకు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఎన్నికల ముందు.. బిడ్డకు జన్మనిచ్చిన పీఎం అభ్యర్థి..!

థాయ్‌లాండ్‌(Thailand)లో రెండువారాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఫలితాల్లో తదుపరి ప్రధాని ఎవరో తేలనున్నారు. ఈ సమయంలో పీఎం పోస్టుకు గట్టి పోటీ ఇస్తోన్న పేటోంగ్టార్న్ షినవత్రా( Paetongtarn Shinawatra) ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె దేశ ప్రజలకు ట్విటర్ వేదికగా వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని