CM KCR: కార్మికులకు గుడ్‌న్యూస్‌.. సీఎం కేసీఆర్‌ మే డే కానుక

పారిశుద్ధ్య కార్మికులకు సీఎం కేసీఆర్‌ మే డే కానుక ప్రకటించారు. వారికి జీతాలు పెంచుతున్నట్లు వెల్లడించారు.

Updated : 01 May 2023 18:55 IST

హైదరాబాద్‌: తెలంగాణలో పారిశుద్ధ్య, ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మే డే కానుక ప్రకటించారు. పారిశుద్ధ్య, ఆర్టీసీ కార్మికుల వేతనాలు పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు నూతన సచివాలయంలో జిల్లాల మంత్రులు, నేతలు, నీటిపారుదల శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో వేతనాలు పెంచుతూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.

పారిశుద్ధ్య కార్మికులకు రూ.వెయ్యి వేతనం పెంచాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,06,474 మంది పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెరగనున్నాయి. జీహచ్‌ఎంసీ, జలమండలి పారిశుద్ధ్య కార్మికులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల కార్మికులకు వేతనాలు పెరగనున్నాయి. పారిశుద్ధ్య కార్మికులకు పెరిగిన వేతనాలు తక్షణమే అమల్లోకి రానున్నాయి.  అలాగే ఆర్టీసీ కార్మికుల వేతనాలు కూడా పెంచాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు వేతనాల పెంపునకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖకు ఆదేశాలు జారీ చేశారు.

సఫాయన్న నీకు సలాం: కేసీఆర్‌

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ స్పందిస్తూ.. ‘‘సఫాయన్న నీకు సలాం’’ అనే నినాదంతో పారిశుద్ధ్య కార్మికుల కృషిని గుర్తిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. వారి త్యాగాలను రాష్ట్ర ఏర్పాటు నుంచి గుర్తిస్తున్నామన్నారు. కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రతి ఒక్క కార్మికుడి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వారి కృషి వల్లే మన పల్లెలు, పట్టణాలకు అవార్డులు వచ్చాయని సీఎం కొనియాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని