Summer Special Trains: వైజాగ్‌ నుంచి 44 ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు.. వివరాలివే..!

Special trains: విశాఖపట్నం నుంచి పలు నగరాలకు సేవలందించే పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది. ఆ వివరాలివే..

Updated : 01 May 2023 20:07 IST

సికింద్రాబాద్‌: వేసవి కాలం(Summer season)లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే(South central Railway) కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ (Visakhapatnam) నుంచి పలు నగరాలకు సర్వీసులందించే 44 వీక్లీ ప్రత్యేక రైళ్ల(Special Trains) సేవలను పొడిగిస్తున్నట్టు తెలిపింది.  విశాఖపట్నం నుంచి మహబూబ్‌నగర్‌, తిరుపతి, బెంగళూరు నగరాల మధ్య రాకపోకలు సాగించే ఈ ప్రత్యేక సర్వీసులను పొడిగిస్తున్నట్టు ట్వీట్‌ చేసింది. మే 1 నుంచి జూన్‌ 29వరకు నిర్దేశించిన వారాల్లో ఆయా రైళ్ల సర్వీసులు కొనసాగనున్నాయి. 

  • విశాఖపట్నం-మహబూబ్‌నగర్‌ (08585) రైలు ప్రతి మంగళవారం సాయంత్రం 5.35గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.30గంటలకు మహబూబ్‌నగర్‌కు చేరుకోనుంది. అలాగే, మహబూబ్‌నగర్‌- విశాఖపట్నం (08586) రైలు ప్రతి బుధవారం సాయంత్రం 6.20గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.50గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఈ వీక్లీ రైలు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, మల్కాజ్‌గిరి, కాచిగూడ, ఉందానగర్‌, షాద్‌నగర్‌, జడ్చర్ల మీదుగా మే 2 నుంచి జూన్‌ 28వరకు రాకపోకలు కొనసాగించనుంది.
  • విశాఖ నుంచి తిరుపతి (08583) రైలు ప్రతి సోమవారం రాత్రి 7.10గంటలకు మరుసటి రోజు ఉదయం 9.15గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అలాగే, తిరుపతి- విశాఖ (08584) రైలు  ప్రతి మంగళవారం రాత్రి 9.55గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయాన్నే 10.15గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.  దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్ల మీదుగా మే 1 నుంచి జూన్‌ 27వరకు రాకపోకలు కొనసాగిస్తుంది.
  • విశాఖ- బెంగళూరు కంటోన్మెంట్‌ (08543) రైలు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3.55 గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.30గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. అలాగే, బెంగళూరు-విశాఖ (08544) రైలు ప్రతి సోమవారం మధ్యాహ్నం 3.50గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.30గంటలకు విశాఖ చేరుకోనుంది. ఈ రైలు సర్వీసులు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట్, కుప్పం, బంగారపేట్‌, కృష్ణరాజపురం స్టేషన్‌ల మీదుగా  మే 7 నుంచి మే 29వరకు రాకపోకలు కొనసాగించనుంది. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ టూ టైరర్‌, త్రి టైర్‌, స్లీపర్‌/సెకెండ్‌ సీటింగ్‌ కోచ్‌లు ఉంటాయని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు