Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 07 Feb 2024 21:06 IST

1. Revanth Reddy: యుద్ధ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి చర్యలు: సీఎం రేవంత్‌రెడ్డి

నెక్లెస్‌రోడ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిర్వహించిన సింగరేణి ఉద్యోగ మేళాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. 441 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యుద్ధ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి చర్యలు చేపడుతున్నామన్నారు. అభ్యర్థులు పరీక్షల తేదీల గురించి ఆలోచించకుండా సన్నద్ధం కావాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Ocean Depths: మహాసముద్రం లోతుల్లో కొత్త జీవుల అన్వేషణ

భూమిపై ఉన్న మహాసముద్రాల్లో లక్షలాది జీవజాతులు ఉన్నాయని మనకు తెలుసు. ఇప్పటివరకు మెరైన్ జీవజాతుల్లో మనుషులు కనుగొన్నది కేవలం 10 శాతమేనని అంచనా. మానవ కార్యకలాపాల వల్ల భూగోళంపై అనేక మార్పులు వస్తున్న వేళ.. ఈ జీవజాతులకు పెనుముప్పు ఏర్పడింది. వీటిపై పరిశోధనలు చేసేందుకు, వాటి సంరక్షణకు న్యూజీలాండ్‌లో ఓ శాస్త్రవేత్తల బృందం పనిచేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Uttam: కేసీఆర్, జగన్ మధ్య ఒప్పందాలతో తెలంగాణకు తీరని అన్యాయం!: మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

కృష్ణానదిపై అక్రమ ప్రాజెక్టులు కట్టి.. తెలంగాణకు రావాల్సిన నీటిని ఏపీకి తరలిస్తుంటే కేసీఆర్ నిశబ్ధంగా ఉన్నారని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మధ్య ఉన్న ఒప్పందాలతో రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేసిన ఆయన.. భారాసపై విమర్శలు గుప్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. E-Luna: కైనటిక్‌ ఇ-లూనా వచ్చేసింది.. సింగిల్‌ ఛార్జ్‌తో 110km

కైనటిక్‌ లూనా కొత్త అవతారంలో తిరిగి మార్కెట్లోకి అడుగుపెట్టింది. దాదాపు ఐదు దశాబ్దాల క్రితం దేశీయ రోడ్లపై పరుగులు ప్రారంభించి కాలగర్భంలో కలిసిపోయిన ఈ మోపెడ్‌.. ఇ-లూనా (E-Luna) రూపంలో రీఎంట్రీ ఇచ్చింది. కైనటిక్‌ గ్రీన్‌ (Kinetic Green) కంపెనీ దీన్ని అధికారికంగా ఫిబ్రవరి 7న ఆవిష్కరించింది. దీని ధర రూ.69,990 నుంచి ప్రారంభమవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Bhadrachalam: భద్రాద్రి రామయ్య ఆలయంలో వెండి వాకిలి.. ఆనందంలో భక్తులు

భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వెండి వాకిలి దర్శనం బుధవారం ప్రారంభమైంది. ఆలయ ప్రవేశానికి మొత్తం 3 మార్గాలు ఉండగా.. ఉచిత దర్శనం దారిలో ఇప్పటికే ఇత్తడి తాపడం ఉంది. అంతరాలయంలో బంగారు వాకిలి గతంలోనే ఏర్పాటు చేశారు. వీటి మధ్యలో ఉన్న ముఖ మండపానికి దాదాపు 100 కిలోల వెండితో తాపడం తయారు చేసి వాటిని ఈ మార్గానికి అమర్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Modi: ‘మా డబ్బులు అంటున్నారు.. అసలు అదేం భాష..?’: విపక్షాలపై మోదీ ఆగ్రహం

‘మా పన్నులు.. మా డబ్బు.. అసలు అదేం భాష’ అంటూ రాజ్యసభ వేదికగా విపక్ష పార్టీలపై ప్రధాని మోదీ(PM Modi) ఆగ్రహం వ్యక్తంచేశారు. నిధుల అంశం అడ్డం పెట్టుకొని కాంగ్రెస్‌ విభజన రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. పన్నుల పంపిణీ, సహాయ నిధులు ఇవ్వకుండా కేంద్రం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందంటూ బుధవారం కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర నేతలు దిల్లీలో ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Congress: కాంగ్రెస్‌లో చేరేందుకు 20 మంది ఎమ్మెల్యేలు సిద్ధం: జగ్గారెడ్డి

పాలనాపరంగా కాంగ్రెస్‌.. భారాస మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జగ్గారెడ్డి అన్నారు. భారాస నేతలు ఏనాడూ సచివాలయానికి రాలేదని.. కేవలం వారి ఇళ్ల నుంచే పరిపాలన కొనసాగించారని ఎద్దేవా చేశారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. లండన్‌లో మాకు ‘వాచ్‌’ పోతోంది.. భారత సీఈవోల ఆందోళన

భారత్‌-బ్రిటన్‌ మధ్య ద్వైపాక్షిక వ్యాపార ఒప్పందాలపై చర్చలు జరపనున్న నేపథ్యంలో పలువురు భారతీయ సీఈవోలు లండన్‌ (London)లోని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు భారత్‌లోని పలు కంపెనీల సీఈవోలు బ్రిటన్‌ షాడో విదేశాంగ కార్యదర్శి డేవిడ్‌ లామీ (David Lammy)తో సమావేశమైనట్లు ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక ఒక కథనంలో పేర్కొంది. ఈ భేటీలో లండన్‌లో జరుగుతున్న వాచ్‌ దొంగతనాలపై ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ICAI CA Foundation Result: సీఏ ఫౌండేషన్‌ పరీక్ష ఫలితాలు విడుదల

ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ (సీఏ) ఫౌండేషన్‌(ICAI CA Foundation) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ICAI) సంస్థ ఈ ఫలితాలను బుధవారం సాయంత్రం ప్రకటించింది.  తమ అధికారిక వెబ్‌సైట్‌ icai.nic.inలో అభ్యర్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. UCC bill: యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఆమోదం

వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకేతరహా నిబంధనల కోసం ఉద్దేశించిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు (UCC) ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. భవిష్యత్‌లో ఇతర భాజపా పాలిత రాష్ట్రాలు సైతం ఈతరహా బిల్లులను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ బిల్లును తాము కూడా తీసుకొస్తామని రాజస్థాన్‌ ఇప్పటికే ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని