Congress: కాంగ్రెస్‌లో చేరేందుకు 20 మంది ఎమ్మెల్యేలు సిద్ధం: జగ్గారెడ్డి

పాలనాపరంగా కాంగ్రెస్‌.. భారాస మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జగ్గారెడ్డి అన్నారు.

Updated : 07 Feb 2024 19:10 IST

హైదరాబాద్‌: పాలనాపరంగా కాంగ్రెస్‌.. భారాస మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జగ్గారెడ్డి అన్నారు. భారాస నేతలు ఏనాడూ సచివాలయానికి రాలేదని.. కేవలం వారి ఇళ్ల నుంచే పరిపాలన కొనసాగించారని ఎద్దేవా చేశారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘భాజపా ఆదేశాలతోనే ఏపీ సీఎం జగన్‌, భారాస అధినేత కేసీఆర్‌ పనిచేస్తున్నారు. వ్యాపారులను కేసీఆర్‌, కేటీఆర్‌ అయోమయానికి గురి చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఉండదని పారిశ్రామికవేత్తలను భయపెడుతున్నారు. తెలంగాణ అభివృద్ధి చెందొద్దని కేసీఆర్‌, జగన్‌ కుట్రలు చేస్తున్నారు. వారి ఎత్తుగడలను తిప్పికొడతాం. ఎమ్మెల్యేలను నిలబెట్టుకునేందుకు భారాస నేతలు డ్రామాలు ఆడుతున్నారు. 20 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లోపే ఈ 20 మందిని పార్టీలోకి తీసుకుంటాం’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు