లండన్‌లో మాకు ‘వాచ్‌’ పోతోంది.. భారత సీఈవోల ఆందోళన

లండన్‌ నగరంలో జరుగుతున్న వాచ్‌ దొంగతనాలపై భారతీయ సీఈవోలు ఆందోళన వ్యక్తంచేశారు. 

Published : 08 Feb 2024 02:04 IST

లండన్‌: భారత్‌-బ్రిటన్‌ మధ్య ద్వైపాక్షిక వ్యాపార ఒప్పందాలపై చర్చలు జరపనున్న నేపథ్యంలో పలువురు భారతీయ సీఈవోలు లండన్‌ (London)లోని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు భారత్‌లోని పలు కంపెనీల సీఈవోలు బ్రిటన్‌ షాడో విదేశాంగ కార్యదర్శి డేవిడ్‌ లామీ (David Lammy)తో సమావేశమైనట్లు ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక ఒక కథనంలో పేర్కొంది. ఈ భేటీలో లండన్‌లో జరుగుతున్న వాచ్‌ దొంగతనాలపై ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.

సమావేశాలు, వ్యాపార అవసరాల నిమిత్తం నగరానికి వచ్చినప్పుడు తమవద్ద ఉండే ఖరీదైన వస్తువులు దొంగతనానికి గురవుతున్నట్లు వారు ఆరోపించారు. దీనిపై దిల్లీకి చెందిన ఓ సంస్థ సీఈవో మాట్లాడుతూ.. ‘‘ఇటీవల లండన్‌లో పర్యటించిన భారతీయ సీఈవోలలో చాలామంది దోపిడీకి గురయ్యారు. వారివద్ద ఉండే లగ్జరీ వాచ్‌లు, ఖరీదైన మొబైల్‌ ఫోన్లు, ఇతర వస్తువులే లక్ష్యంగా దొంగతనాలు జరుగుతున్నాయి. దీనిపై లండన్‌ పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. మాకు సౌకర్యంగా లేని ప్రాంతానికి ఎందుకు వెళ్లాలి? ఈ విషయమై బ్రిటన్‌ ప్రభుత్వానికి మా ఆందోళన తెలియజేశాం’’ అని అన్నారు. 

అయ్యో ఆర్కాస్‌.. ఊపిరాడక విలవిల్లాడుతున్న మూగజీవాలు!

లండన్ నగరంలో 2022తో పోలిస్తే.. గతేడాదిలో వాచ్‌, మొబైల్‌, హ్యాండ్‌బ్యాగ్‌ దొంగతనాలు 27 శాతం మేర పెరిగినట్లు ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పేర్కొంది. గత ఐదేళ్లలో సుమారు 29 వేల లగ్జరీ వాచ్‌లను దొంగతనం చేసినట్లు వెల్లడించింది. 2022లో 52 వేల దొంగతనాలు నమోదవగా, 2023లో 72 వేల కేసులు నమోదైనట్లు మెట్రోపాలిటన్‌ పోలీసులు వెల్లడించారు. నగరంలో నేరాల సంఖ్య పెరగడం ఎన్నికల ముందు అక్కడి పార్టీలకు రాజకీయ సమస్యగా మారింది. వాచ్‌ దొంగలను కట్టడి చేసేందుకు గత నెలలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు లండన్‌ పోలీసులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని