Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 11 Jun 2023 21:00 IST

1. నాలుగేళ్ల జగన్‌ పాలనలో అంతా అవినీతి, కుంభకోణాలే: అమిత్‌ షా

రైతుల సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకొంటున్న జగన్‌ ప్రభుత్వం.. రైతుల ఆత్మహత్యల విషయంలో సిగ్గుతో తలదించుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో ఉందని తెలిపారు. మోదీ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అభివృధ్ధిపై విశాఖ రైల్వే గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భాజపా బహిరంగ సభకు అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రాష్ట్ర చారిత్రక వారసత్వం ఎంతో మహోన్నతమైంది: సీఎం కేసీఆర్‌

రాష్ట్ర చారిత్రక వారసత్వం మహోన్నతమైందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు.  కోట్లాది సంవత్సరాల చరిత్రకు తెలంగాణ సాక్ష్యంగా నిలవడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 20 కోట్ల ఏళ్ల క్రితం చారిత్రక ఆనవాళ్లు తెలంగాణలో లభించడం గర్వకారణమన్నారు. ఈ దిశగా తెలంగాణ చరిత్రకారులు చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. బహనాగ వద్ద పునరుద్ధరణ పనులు.. 15 రైళ్లు రద్దు.. పూర్తి లిస్ట్‌ ఇదే!

ఇటీవల ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ దుర్ఘటన(Odisha train accident) వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో దాదాపు 280మందికి పైగా మృతిచెందగా.. అనేకమంది గాయపడిన విషయం తెలిసిందే. ఆ మార్గంలో రైలు పట్టాలు ధ్వంసం కావడంతో బహనాగ బజార్‌ రైల్వే స్టేషన్‌ వద్ద పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆ పదవికి సుప్రియ పేరును సూచించిందే నేను: అజిత్‌ పవార్‌

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా సుప్రియా సూలే, ప్రఫుల్‌ పటేల్‌ నియమితులైన విషయం తెలిసిందే. ఈ ప్రకటన అనంతరం పార్టీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌  పార్టీ కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. దీంతో ఈ నియామకాలపై అజిత్‌ పవార్‌ అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వచ్చాయి. పలు విపక్ష పార్టీలు ఎన్సీపీలో అజిత్‌కు ప్రాధాన్యత లేదని భావిస్తున్నాయి. తాజాగా వీటిపై అజిత్‌ స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పాక్‌ గగనతలంలోకి దూసుకెళ్లిన ఇండిగో విమానం!

ప్రయాణికులతో అమృత్‌సర్‌ నుంచి అహ్మదాబాద్‌కు వెళ్తున్న ఇండిగో విమానం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పాకిస్థాన్‌ గగనతలంలోకి దూసుకెళ్లింది. దాదాపు 30 నిమిషాలపాటు పాక్‌ ఎయిర్‌స్పేస్‌లోనే ప్రయాణించి లాహోర్‌కు సమీపంలో ఉన్న గుర్జన్‌వాలా వరకు వెళ్లిపోయింది. ఈ ఘటన శనివారం రాత్రి 7.30 సమయంలో చోటు చేసుకోగా.. చివరికి రాత్రి 8.01 గంటలకు విమానం తిరిగి భారత్‌కు చేరినట్లు ఇండిగో సంస్థ తాజాగా వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మోదీని ఆకట్ట్టుకొన్న జపాన్‌ రాయబారి ట్వీట్‌..!

భారత్‌లోని జపాన్‌ రాయబారి హిరోషి సుజుకి దంపతులు దేశీయ రుచులను ఆస్వాదిస్తున్న తీరు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆకర్షించింది. ప్రధాని నియోజకవర్గమైన వారణాసిలో గత నెల హిరోషి దంపతులు బనారసీ చాట్‌, తాలి ఆరగించిన చిత్రాలను ట్విటర్‌లో పంచుకొన్నారు. ఈ సారి హిరోషి దంపతులు ముంబయిలో వడాపావ్‌ను రుచి చూశారు. తాజాగా ఆ దంపతులు స్ట్రీట్‌ఫుడ్‌ అన్వేషణలో భాగంగా కొల్హాపురి వంటకాలను తిన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మహిళలు, పిల్లలే పావులుగా.. ప్రమాదకర ఉగ్ర ధోరణి వెలుగులోకి!

కశ్మీర్‌ లోయ (Kashmir Valley)లో ఆయుధాలు, సందేశాల చేరవేతకు పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ (Pakistan ISI), ఉగ్రవాద సంస్థలు (Terror Groups).. మహిళలు, పిల్లలను వినియోగిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిందని ఓ ఆర్మీ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇది చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు నియంత్రణ రేఖ(LOC) వెంబడి తిష్ఠవేసిన మూకలు.. శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాల్లో ఉన్నాయని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పాకిస్థాన్‌లో భారీ వర్షాలు.. 27 మంది మృతి!

ఇప్పటికే ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో సతమతమవుతోన్న పాకిస్థాన్‌ (pakistan)ను ఈదురు గాలులు, భారీ వర్షాలు (Heavy Rains) కుదిపేస్తున్నాయి. శనివారం రాత్రి పాక్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షాల ధాటికి 27 మంది మృతి చెందారని, వారిలో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అమెరికా ముంగిట చైనా గూఢచర్యం.. క్యూబాలో డ్రాగన్‌ వేగులు..! 

గూఢచర్యంపై అమెరికా- చైనా మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తమ దేశానికి అత్యంత సమీపంలోని క్యూబా(Cuba)లో చైనా గూఢచర్య కార్యాలయాలు నిర్వహిస్తోందని అమెరికా అధికారి ఒకరు బాంబు పేల్చారు. దీని ఆధారంగా అక్కడి పత్రికలు కథనాలు ప్రచురించాయి. 2019లో ట్రంప్‌ హయాంలో మొదలైన కార్యకలాపాలను చైనా మెల్లగా విస్తరిస్తోందని వాటిల్లో పేర్కొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నా భార్యను అర్ధనగ్నంగా చేసి 120 మంది దాడి.. డీజీపీకి ఆర్మీజవాన్‌ ఫిర్యాదు

తమిళనాడు(Tamil Nadu)లో ఉన్న తన భార్యపై దాదాపు 120 మంది దాడి చేశారని ఆరోపిస్తూ ఓ జవాను వీడియో రూపంలో రాష్ట్ర పోలీసులు, డీజీపీకి ఫిర్యాదు చేశాడు. ఈ వీడియోను ఆర్మీ విశ్రాంత లెఫ్టినెంట్‌ కర్నల్‌ ఎన్‌.త్యాగరాజన్‌ ట్విటర్‌లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. తమిళనాడుకు చెందిన ప్రభాకరన్‌ ఆర్మీలో హవాల్దార్‌గా పనిచేస్తున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు