CM KCR: రాష్ట్ర చారిత్రక వారసత్వం ఎంతో మహోన్నతమైంది: సీఎం కేసీఆర్‌

భారత్‌ జాగృతి సంస్థ ప్రచురించిన తెలంగాణ చరిత్ర పుస్తకం 5 సంపుటాలను రాష్ట్ర అవతరణ శతాబ్ది ఉత్సవాల్లో సాహిత్య దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు.

Published : 11 Jun 2023 19:28 IST

హైదరాబాద్‌: రాష్ట్ర చారిత్రక వారసత్వం మహోన్నతమైందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు.  కోట్లాది సంవత్సరాల చరిత్రకు తెలంగాణ సాక్ష్యంగా నిలవడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 20 కోట్ల ఏళ్ల క్రితం చారిత్రక ఆనవాళ్లు తెలంగాణలో లభించడం గర్వకారణమన్నారు. ఈ దిశగా తెలంగాణ చరిత్రకారులు చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. 

రాష్ట్ర చరిత్రను భావి తరాలకు తెలిపే విధంగా భారత్‌ జాగృతి సంస్థ ప్రచురించిన తెలంగాణ చరిత్ర పుస్తకం 5 సంపుటాలను రాష్ట్ర అవతరణ శతాబ్ది ఉత్సవాల్లో సాహిత్య దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ ఆవిష్కరించారు. దాదాపు 20 కోట్ల ఏళ్లలో తెలంగాణలో కొనసాగిన పరిస్థితులు, పరిపాలన విధానాలు, నాటి దర్శనీకతను అర్థం చేసుకుంటే అవి రేపటి తరాలకి దారి చూపుతాయన్నారు. మన గత చరిత్రను అర్థం చేసుకోవడం ద్వారా, వర్తమానాన్ని అవగాహన చేసుకుంటూ తద్వారా భవిష్యత్తుకు బాటలు వేసుకోగలమని సీఎం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని