Train cancellation: బహనాగ వద్ద పునరుద్ధరణ పనులు.. 15 రైళ్లు రద్దు.. పూర్తి లిస్ట్‌ ఇదే!

Trains Cancellation: ఇటీవల బాలేశ్వర్‌ వద్ద రైలు దుర్ఘటన నేపథ్యంలో అక్కడ రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ పనులు కొనసాగుండటంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. ఈ మేరకు జాబితాను విడుదల చేసింది.

Updated : 12 Jun 2023 10:17 IST

సికింద్రాబాద్‌: ఇటీవల ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ దుర్ఘటన(Odisha train accident) వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో దాదాపు 280మందికి పైగా మృతిచెందగా.. అనేకమంది గాయపడిన విషయం తెలిసిందే. ఆ మార్గంలో రైలు పట్టాలు ధ్వంసం కావడంతో బహనాగ బజార్‌ రైల్వే స్టేషన్‌ వద్ద పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ప్రమాదం తర్వాత యుద్ధప్రాతిపదికన చేపట్టిన పునరుద్ధరణ పనులతో ఇప్పటికే పలు సర్వీసులు కొనసాగుతుండగా.. హావ్‌డా వైపు రాకపోకలు కొనసాగించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆది, సోమ, మంగళ, బుధవారాల్లో మొత్తంగా 15 రైళ్లు రద్దు చేస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే, ఈ నెల 12న చెన్నై సెంట్రల్‌ -షాలిమార్‌ (12842)రైలు సర్వీసు సేవలను పునరుద్ధరిస్తున్నట్టు తెలిపింది.

రద్దైన రైళ్ల జాబితా ఇదే..

ఈ నెల 11న (ఆదివారం) మైసూరు- హావ్‌డా (22818) రైలును రద్దు చేసిన అధికారులు.. 12వ తేదీన సర్వీసులందించాల్సిన హైదరాబాద్‌-షాలిమార్‌ (18046); ఎర్నాకుళం-హావ్‌డా (22878), సంత్రగాచి-తంబ్రం(22841), హావ్‌డా-చెన్నై సెంట్రల్‌ (12839) రైలు సర్వీసులను రద్దు చేశారు. అలాగే, ఈ నెల 13న సంత్రగాచి-చెన్నై సెంట్రల్‌(22807), హావ్‌డా- ఎఎంవీటీ బెంగళూరు(22887), షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ (22825), షాలిమార్‌-హైదరాబాద్‌(18045), సికింద్రాబాద్‌-షాలిమార్‌(12774), హైదరాబాద్‌-షాలిమార్‌ (18046), విల్లుపురం-ఖరగ్‌పూర్‌(22604) రైలు సర్వీసులు; 14వ తేదీన సర్వీసులందించే ఎస్‌ఎంవీటీ బెంగళూరు-హావ్‌డా (22864), భాగల్పూర్‌ -ఎస్‌ఎంవీటీ బెంగళూరు(12254), షాలిమార్‌-సికింద్రాబాద్‌ (12773) సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే పీఆర్వో రాకేశ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని