Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 23 Jun 2023 21:10 IST

1. అరాచకం ఆగాలి.. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలి: పవన్‌ కల్యాణ్‌

హలో ఏపీ.. బైబై వైసీపీ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళుతూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పదో రోజు వారాహి యాత్ర కొనసాగిస్తున్నారు. కోనసీమ జిల్లా అమలాపురంలో జనసేన నియోజకవర్గ నేతలతో పవన్‌ సమావేశమయ్యారు. ఆ తర్వాత రోడ్‌ షో నిర్వహించారు. బండారులంక మీదుగా అంబాజీపేట చౌరస్తాకు చేరుకుని అక్కడ ఉన్న ప్రజలకు అభివాదం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోరాడతాం.. ఐక్యతా రాగం వినిపించిన విపక్ష నేతలు

2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఎదుర్కొనే లక్ష్యంతో బిహార్‌ రాజధాని పట్నా వేదికగా జరిగిన విపక్షాల భేటీ ముగిసింది. అనంతరం విపక్ష నేతలు మీడియాతో మాట్లాడుతూ.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తాము కలిసికట్టుగా పోరాడేందుకు అన్ని పార్టీల నేతలు అంగీకరించినట్లు వెల్లడించారు. తమ మధ్య ఎంతో సానుకూల చర్చ జరిగిందని తెలిపారు. అలాగే భవిష్యత్తు కార్యాచరణ నిమిత్తం తదుపరి సమావేశం శిమ్లాలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నిజజీవితంలో రాహుల్‌గాంధీ ఓ దేవదాస్‌..పట్నాలో భాజపా ఫ్లెక్సీ

పట్నాలో పెద్దఎత్తున జరుగుతున్న ప్రతిపక్షాల సమావేశంతో భాజపా, కాంగ్రెస్‌ నేతల విమర్శలు పోటాపోటీగా వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాల సమావేశానికి ముందు భాజపా కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీ నిజజీవితంలోనే దేవదాసని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ‘‘మమత బెనర్జీ బెంగాల్‌ను, కేజ్రీవాల్‌ దిల్లీ, పంజాబ్‌ను వీడాలి. లాలు, నితీశ్‌ కుమార్‌ బిహార్‌ను, అఖిలేష్‌ యాదవ్‌ ఉత్తర్‌ ప్రదేశ్‌ను, స్టాలిన్‌ తమిళనాడును, రాహుల్‌ గాంధీ రాజకీయాలను వీడాలని అందరూ కాంగ్రెస్‌ను అడిగే రోజు ఎంతో దూరంలో లేదు. షారుఖ్‌ ఖాన్‌ రీల్‌ దేవదాసు , రాహుల్‌ గాంధీ రియల్‌  లైఫ్‌  దేవదాసు’’ అని ఫ్లెక్సీలో రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రాజకీయాల్లో వారసత్వం ఎంట్రీ కార్డు మాత్రమే: గుత్తా సుఖేందర్‌రెడ్డి

ఎమ్మెల్సీగా తనకు ఇంకా నాలుగేళ్ల పదవీకాలం ఉందని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. పార్టీ అధిష్ఠానం అవకాశం ఇస్తే తన కుమారుడు అమిత్ పోటీలో ఉంటారన్నారు. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే పార్టీ కోసం పనిచేస్తామన్నారు. రాజకీయాల్లో వారసత్వం కేవలం ఎంట్రీకే ఉపయోగపడుతుందని.. వ్యక్తిగతంగా ప్రజల మద్దతు పొందిన వారికే భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కొత్త విద్యుత్‌ నిబంధనలు.. పగలు రాయితీ.. రాత్రి బాదుడు..!

విద్యుత్‌ ఛార్జీల నియమనిబంధనల్లో కొత్తగా మార్పులు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టైమ్‌ ఆఫ్‌ డే టారిఫ్‌ సిస్టమ్ పేరుతో తీసుకొస్తున్న ఈ విధానం ద్వారా ఉదయం వేళల్లో వినియోగదారులపై విద్యుత్‌ ఛార్జీల భారం 20 శాతం మేర తగ్గనుంది. అదేవిధంగా డిమాండ్ ఎక్కువగా ఉండే రాత్రి వేళల్లో విద్యుత్‌ ఛార్జీలు సాధారణం కంటే 10 నుంచి 20 శాతం మేర పెరుగుతాయని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఒకప్పుడు జావా డెవలపర్‌.. ఇప్పుడు ర్యాపిడో డ్రైవర్‌

ఆర్థిక మాంద్యం భయాలతో గతేడాది చివర్లో ప్రారంభమైన లేఆఫ్‌లు (Layoffs) ఇప్పటికీ కొన్ని సంస్థల్లో కొనసాగుతూనే ఉన్నాయి. లేఆఫ్‌ల కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారిలో కొందరు ఇతర రంగాల్లో పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలు చేస్తూ.. అర్హతకు తగిన అవకాశాల కోసం అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్‌ ఆర్థిక మాంద్యం కారణంగా ఉద్యోగం కోల్పోయి బైక్‌ ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వివరాలను ట్విటర్‌లో షేర్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వాడేది రెండే బల్బులు.. బిల్లు రూ.లక్ష చూసి కంగుతిన్న వృద్ధురాలు

ఇంట్లో ఏసీ, టీవీ, రిఫ్రిజిరేటర్‌ ఇతరత్రా వస్తువులు ఉన్న వారికి రూ.వేలల్లో మాత్రమే కరెంటు బిల్లు వస్తుంది. కానీ కర్ణాటకలోని కొప్పల్‌లో నివసిస్తున్న ఓ వృద్ధురాలికి మే నెల కరెంటు బిల్లు రూ.లక్ష  వచ్చింది. ఆమె ఇంట్లో రెండు సాధారణ బల్బులు మినహా ఇతర వస్తువులేవీ లేకపోవడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘నాన్న సంతోషం కోసం వెళ్లి..’ టైటాన్‌లో ప్రాణాలు కోల్పోయి!

అట్లాంటిక్‌ మహా సముద్రంలో విచ్ఛిన్నమైన టైటాన్‌ మినీ జలాంతర్గామిలో  ఓషన్‌గేట్‌ సంస్థ సీఈవో స్టాక్టన్‌ రష్‌తో పాటు మరో నలుగురు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అందులో పాకిస్థానీ బిలియనీర్‌ హెహ్‌జాదా దావూద్‌తో పాటు సులేమాన్‌ కూడా ఉన్నారు. సులేమాన్‌కు అసలు ఇటువంటి సాహస యాత్రలంటే భయమట. కేవలం తండ్రి అభీష్టం మేరకే ఈ టైటాన్‌లో వెళ్లి సముద్రగర్భంలో చనిపోయినట్లు అతడి సమీప బంధువులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సమోసా కాకస్‌ ఫ్లేవర్ మరింత విస్తరించాలి.. యూఎస్‌ కాంగ్రెస్‌లో మోదీ వ్యాఖ్య

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రస్తుతం అమెరికా (America) పర్యటనలో ఉన్నారు. ఆయన అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అగ్రదేశంలో కీలక పదవుల్లో కొనసాగుతున్న ప్రవాస భారతీయులపై ఆయన ప్రశంసలు కురిపించారు. భారత మూలాలు కలిగిన ఎందరో వ్యక్తులు ప్రస్తుతం అమెరికాలో తమ మార్క్‌ చూపిస్తున్నారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సింగిల్‌ పేమెంట్‌తో LIC నుంచి కొత్త పాలసీ

ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) ధన వృద్ధి (Dhan Vridhhi) పేరిట కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. నేటి (జూన్‌ 23) నుంచి సెప్టెంబర్‌ 30 వరకు పాలసీ అందుబాటులో ఉంటుందని ఎల్‌ఐసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది నాన్‌ లింక్డ్‌, నాన్‌ పార్టిసిపేటింగ్‌, ఇండివిడ్యువల్‌, సేవింగ్స్‌తో కూడిన సింగిల్‌ ప్రీమియంతో వస్తున్న లైఫ్‌ ప్లాన్‌. ఇటు బీమాతో పాటు సొమ్ముకు రాబడి హామీ ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని