నిజజీవితంలో రాహుల్‌గాంధీ ఓ దేవదాస్‌..పట్నాలో భాజపా ఫ్లెక్సీ

కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీపై భాజపా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. షారుఖ్‌ ఖాన్‌ రీల్‌ దేవదాసు అయితే రాహుల్ గాంధీ రియల్‌ లైఫ్‌ దేవదాస్‌ అని విమర్శిస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది.

Published : 23 Jun 2023 16:47 IST

పట్నా :  పట్నాలో పెద్దఎత్తున జరుగుతున్న ప్రతిపక్షాల సమావేశంతో భాజపా, కాంగ్రెస్‌ నేతల విమర్శలు పోటాపోటీగా వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాల సమావేశానికి ముందు భాజపా కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీ నిజజీవితంలోనే దేవదాసని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ‘‘మమత బెనర్జీ బెంగాల్‌ను, కేజ్రీవాల్‌ దిల్లీ, పంజాబ్‌ను వీడాలి. లాలు, నితీశ్‌ కుమార్‌ బిహార్‌ను, అఖిలేష్‌ యాదవ్‌ ఉత్తర్‌ ప్రదేశ్‌ను, స్టాలిన్‌ తమిళనాడును, రాహుల్‌ గాంధీ రాజకీయాలను వీడాలని అందరూ కాంగ్రెస్‌ను అడిగే రోజు ఎంతో దూరంలో లేదు.  షారుఖ్‌ ఖాన్‌ రీల్‌ దేవదాసు , రాహుల్‌ గాంధీ రియల్‌  లైఫ్‌  దేవదాసు’’ అని ఫ్లెక్సీలో రాశారు.

బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ సంకల్పంతో భాజపాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో పట్నాలో సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీని కోసం కాంగ్రెసు నాయకుడు రాహుల్‌ గాంధీ, పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున్‌ ఖర్గే,  విపక్ష పార్టీ నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రెసిడెంట్‌ మల్లికార్జున్‌ ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాల సమావేశం ఎజెండా భాజపాను గద్దె దించడమే. అందుకే అందరం కలిసి పోరాడుతున్నామన్నారు. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని