Gutha Sukender Reddy: రాజకీయాల్లో వారసత్వం ఎంట్రీ కార్డు మాత్రమే: గుత్తా సుఖేందర్‌రెడ్డి

రాజకీయాల్లో వారసత్వం కేవలం ఎంట్రీకే ఉపయోగపడుతుందని.. వ్యక్తిగతంగా ప్రజల మద్దతు పొందిన వారికే భవిష్యత్తు ఉంటుందని తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

Published : 23 Jun 2023 17:49 IST

హైదరాబాద్: ఎమ్మెల్సీగా తనకు ఇంకా నాలుగేళ్ల పదవీకాలం ఉందని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. పార్టీ అధిష్ఠానం అవకాశం ఇస్తే తన కుమారుడు అమిత్ పోటీలో ఉంటారన్నారు. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే పార్టీ కోసం పనిచేస్తామన్నారు. రాజకీయాల్లో వారసత్వం కేవలం ఎంట్రీకే ఉపయోగపడుతుందని.. వ్యక్తిగతంగా ప్రజల మద్దతు పొందిన వారికే భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. శాసనమండలిలోని తన ఛాంబర్‌లో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

‘‘ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు భారాసలో చేరే అవకాశం ఉంది. కేసీఆర్ సీఎంగా మరోసారి భారాస ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని సీట్లు భారాసవే. కాంగ్రెస్‌లో చేరుతామంటున్న ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లా నేతలు.. ఎక్కువగా ఊహించుకుంటున్నారు. ఖమ్మంలో భారాసకు 2018 ఎన్నికల కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి. కాంగ్రెస్ లేని కూటమి తమ విధానమని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అందుకే పట్నాలో విపక్షాల సమావేశానికి వెళ్లలేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్రానికి అన్యాయమే చేసింది. తెలుగు రాష్ట్రాలకు విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రం విఫలమైంది’’ అని గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని