Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 26 Apr 2023 21:18 IST

1. ఏపీ ఇంటర్‌ ఫలితాల్లో కృష్ణా ఫస్ట్‌.. విజయనగరం లాస్ట్‌

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు నిర్వహించిన ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ప్రకటించారు. ఇంటర్‌ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించినట్టు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.90తో నగరమంతా తిరగొచ్చు..!

ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వేసవి నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ప్రయాణించే వారికి ఆర్థిక భారం తగ్గించే విధంగా నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రయాణికులకు టి-24 టికెట్‌ ధరను రూ.100 నుంచి రూ.90కి తగ్గించింది. ఇదే టికెట్‌ను సీనియర్‌ సిటిజన్లకు రూ.80కే అందించనున్నట్టు టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. సీఎం జగన్‌కు నిరసన సెగ.. కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు రైతుల యత్నం

అనంతపురం జిల్లాలో సీఎం జగన్‌కు రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు రైతులు యత్నించారు. సింగనమల నియోజకవర్గం పరిధిలోని నార్పలలో ఏర్పాటు చేసిన జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొని సీఎం జగన్‌ రోడ్డు మార్గంలో పుట్టపర్తి వెళ్తుండగా.. ధర్మవరం మండలం పోతులనాగేపల్లి వద్ద సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు రైతులు యత్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. మా చిన్నాన్నది ఆస్తి కోసం జరిగిన హత్య కాదు: వైఎస్‌ షర్మిల

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి ఆస్తులపై వైతెపా అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వివేకా పేరుపై ఉన్న ఆస్తులన్నీ ఎప్పుడో సునీత పేరు మీదే రాశారని తెలిపారు. ‘‘ఆస్తులన్నీ ఎప్పట్నుంచో సునీత పేరు మీదే ఉన్నాయి. సునీత పేర ఆస్తులన్నీ ఉంటే వేరే వారికి రాస్తారనడంలో అర్థమే లేదు. ఆస్తుల కోసమే వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి  హత్య చేశారనుకుంటే చంపాల్సింది.. వివేకాను కాదు సునీతను’’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ‘మోదీజీ.. మా మన్‌ కీ బాత్‌ కూడా వినండి’: మహిళా రెజ్లర్లు

భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ (Brij Bhushan)పై కేను నమోదు చేయాలని కోరుతూ ఏడుగురు మహిళా రెజ్లర్లు దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఆదివారం నుంచి నిరసన చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు అతనిని అరెస్ట్‌ చేయాలని కోరుతూ సుప్రీం కోర్టు (Supreme Court)లో పిటిషన్‌ దాఖలు చేశారు. త్వరలోనే వీరంతా ప్రధాని మోదీని కలిసి తమ బాధను వివరిస్తామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. పాస్‌వర్డ్‌ షేరింగ్‌కు ఛార్జీ.. నెట్‌ఫ్లిక్స్‌కు యూజర్ల షాక్‌!

పాస్‌వర్డ్‌ షేరింగ్‌కు డబ్బులు వసూలు చేయాలన్న ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ వ్యూహం బెడిసికొట్టిందా? పాస్‌వర్డ్‌ షేరింగ్‌ను నిరోధించేందుకు చేసిన ప్రయత్నం అసలుకే మోసం తెచ్చేలా ఉందా? అంటే అవుననే అంటోంది ఈ నివేదిక. పాస్‌వర్డ్‌ షేరింగ్‌ను అరికట్టేందుకు నెట్‌ఫ్లిక్స్‌ తీసుకున్న చర్యల కారణంగా స్పెయిన్‌లో ఏకంగా 10 లక్షల మంది యూజర్లను నెట్‌ఫ్లిక్స్‌ కోల్పోయిందని మార్కెట్‌ రీసెర్చి సంస్థ కాంటార్‌ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ట్విటర్‌ అకౌంట్‌తో మస్క్‌కు ఏడాదికి ₹8.2 కోట్లు..!

మైక్రో బ్లాగింగ్‌ వెబ్‌సైట్‌ ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచీ అందులో ఎన్నో మార్పులు చేశారు ఎలాన్‌మస్క్‌. బ్లూ టిక్‌కు ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభించారు. తాజాగా యూజర్లు తమ కంటెంట్‌ నుంచి డబ్బు సంపాదించుకునేందుకు మానిటైజేషన్‌ ఆప్షన్‌ తీసుకొచ్చారు. సుదీర్ఘ సమాచారం నుంచి ఎక్కువ నిడివి గల వీడియోల వరకు దేనికైనా సబ్‌స్క్రిప్షన్‌ ఆప్షన్‌ పెట్టుకొని డబ్బులు ఆర్జించుకోవచ్చని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ఖరీదైన మార్బుల్స్‌..ఒక్కో కర్టెన్‌కు రూ.8 లక్షలు: కేజ్రీవాల్‌ నివాసంపై భాజపా విమర్శలు

ఇంటి మరమ్మతుల కోసం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ రూ.45 కోట్లు వెచ్చించారని భాజపా తీవ్ర ఆరోపణలు గుప్పించింది. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నిజాయతీ, నిరాడంబరత గురించి మాట్లాడిన వ్యక్తి.. ఇప్పుడు తనను తాను మహారాజులా భావిస్తున్నారని దుయ్యబట్టింది. ఈ విషయాలు బయటపెట్టకుండా ఉండేందుకు కేజ్రీవాల్ మీడియా సంస్థలకు రూ.20 నుంచి 50 కోట్లు ఆఫర్‌ చేసినట్లు కమలం పార్టీ నేత సంబిత్ పాత్ర ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ‘ట్రంప్‌ నాపై అత్యాచారం చేశారు..’ మాజీ కాలమిస్ట్‌ ఆరోపణ..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతోన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను పలు కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఓ శృంగార తారతో అనైతిక ఆర్థిక ఒప్పందం చేసుకున్నారన్న కేసులో ఆయన అరెస్టై విడుదలైన విషయం తెలిసిందే. ఈ వివాదం ముగియక ముందే 1990ల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ తనపై లైంగిక దాడి చేశారంటూ అమెరికన్‌ మాజీ కాలమిస్ట్‌ జీన్‌ కారొల్‌ చేసిన ఆరోపణల కేసు తెరపైకి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. రోహిత్‌ శర్మ ఐపీఎల్‌ నుంచి విరామం తీసుకోవాలి: సునీల్ గావస్కర్

ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు భారత మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్‌ కీలక సూచన చేశాడు. ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు. తద్వారా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌కు ఫ్రెష్‌ మైండ్‌సెట్‌తో బరిలోకి దిగొచ్చని చెప్పాడు. అవసరమైతే రోహిత్‌ ఐపీఎల్ చివరి అంకంలో మూడు, నాలుగు మ్యాచ్‌లు ఆడి లయను అందుకోవచ్చని గావస్కర్‌ వివరించాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని