Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 27 Apr 2023 21:17 IST

1. ఆ ఎమ్మెల్యేల చిట్టా నా దగ్గరుంది.. ఇదే లాస్ట్‌ వార్నింగ్‌: కేసీఆర్‌

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం అమలు అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్రంగా స్పందించారు. దళితబంధుపై  ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్‌ ఇచ్చారు. భారాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కొత్త పీఆర్సీ నియామకంపై త్వరలోనే నిర్ణయం: బొత్స

సీపీఎస్‌కు చట్టబద్ధత లేదన్న అంశంపై ఎవరో మాట్లాడితే స్పందించలేనని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల నేతలతో అనధికార సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సమావేశంలో సీపీఎస్‌ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌, డీఏ బకాయిలపై చర్చించామని తెలిపారు. ఉద్యోగులకు సంబంధించిన వివిధ అంశాలపై మే 1 నుంచి జీవోలు జారీ చేస్తామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. గంగపుత్రులపై రాహుల్ హామీల వర్షం.. లీటరు డీజిల్‌పై ₹25 రాయితీ.. ఇంకా..!

కర్ణాటక ఎన్నిక(Karnataka Elections)ల్లో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో భాజపా, కాంగ్రెస్‌ అగ్రనేతలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఓటర్లను తమ వైపు ఆకర్షించేందుకు అనేక హామీలు గుప్పిస్తున్నారు. తాజాగా ఉడుపి జిల్లాలోని కాపు ప్రాంతంలో మత్స్యకారులతో సమావేశం నిర్వహించిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) వారిపై హామీల వర్షం కురిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. బెళగావి.. కంచుకోటలో ‘కాషాయానికి’ కష్టాలు..!

కర్ణాటక అర్బన్‌ తర్వాత అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న జిల్లా బెళగావి. గడిచిన రెండు దశాబ్దాలుగా భాజపాకు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో ఇటీవల రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటివరకు లింగాయత్‌ వర్గం చుట్టూ తిరిగిన రాజకీయాలు. కొన్ని దశాబ్దాల క్రితం వరకు బలంగా ఉన్న మహారాష్ట్ర ఏకీకరణ్‌ సమితి (MES) గత కొన్ని ఎన్నికలనుంచి పెద్దగా ప్రభావం చూపడం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ధోనీ ‘ఛేజింగ్‌ మంత్ర’ను అందరూ పాటించాలి: కెవిన్ పీటర్సెన్

ఐపీఎల్ 2023వ సీజన్‌లో కోల్‌కతా చేతిలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB vs KKR) 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. లక్ష్య ఛేదన చివరి దశలో ఆర్‌సీబీ బ్యాటర్లు దూకుడుగా ఆడటంలో విఫలమయ్యారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సెన్ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఛేదన సమయంలో ఎంఎస్ ధోనీ ఎలా ఆడతాడో చూసి నేర్చుకోవాలని ఆర్‌సీబీ బ్యాటర్లకు సూచించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నిజానికి మేం బలైపోవాల్సింది.. కానీ, దేవుడే మమ్మల్ని కాపాడాడు

అప్పటిదాకా మరో వాహనంలో తమ వెనకే వచ్చారు. ముందుగా గమ్యస్థానాన్ని చేరుకోవాలని వాహనం వేగాన్ని పెంచారు. కానీ, అదే వారి చివరి మజిలీ అవుతుందని ఊహించలేకపోయారు. బుధవారం దంతెవాడలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి 10 మంది డిస్ట్రిక్ట్‌ రిజర్వు గార్డు (DRG) జవాన్లతోపాటు మినీ బస్సు డ్రైవర్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అమెరికా-దక్షిణ కొరియాల మధ్య అణ్వస్త్ర డీల్‌..!

అమెరికా-దక్షిణ కొరియా మధ్య అత్యంత కీలకమైన ఒప్పందం కుదిరింది. ఈ డీల్‌ కింద ఉత్తర కొరియాను అదుపు చేసేందుకు అమెరికా అణ్వాయుధాలతో కూడిన జలాంతర్గామిని దక్షిణకొరియా తీరంలో మోహరించనుంది. దీంతోపాటు సియోల్‌ నూక్లియర్‌ ప్లానింగ్‌ ఆపరేషన్స్‌లో భాగం కానుంది. దీనికి బదులుగా దక్షిణ కొరియా సొంతంగా అణ్వాయుధాలు తయారు చేయాలనుకొన్న ప్రణాళికలను వదులుకోనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నా జీతం మీ స్టార్టప్‌ కంటే ఎక్కువ.. సీఈవోకి మహిళా ఉద్యోగిని సమాధానం

సామాజిక మాధ్యమాల్లో చేసిన కొన్ని పోస్టులు ఆసక్తిని రేకెత్తిస్తాయి. చాలా కాలం వాటిపై చర్చ కూడా జరుగుతుంది. అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ సంస్థ వాల్‌నట్‌ సీఈవో రోషన్‌ పటేల్‌కు  రెండేళ్ల క్రితం ఎదురైన చేదు అనుభవం తాజాగా ట్విటర్‌లో వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. రోషన్‌ పటేల్‌ 2021లో ఓ స్టార్టప్‌ను ప్రారంభించాలనుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఛార్‌ధామ్‌లో జియో 5జీ సేవలు.. ఎయిర్‌టెల్‌ కొత్త మైలురాయి

ప్రముఖ టెలికాం కంపెనీలైన రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ 5జీ విషయంలో పోటీపడుతున్నాయి. దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా రిలయన్స్ జియో ఛార్‌ధామ్‌ ఆలయాల్లో తన 5జీ సేవలను అందుబాటులోకి తేగా.. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్‌ దేశవ్యాప్తంగా 3 వేల నగరాలు/ పట్టణాలకు తన 5జీ ప్లస్ నెట్‌వర్క్‌ను విస్తరించి కొత్త మైలురాయిని అందుకుంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘వీటో’ తీరుపై మండిపడ్డ భారత్‌.. స్వార్థ ప్రయోజనాలకే ఆ దేశాల వినియోగం

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో వీటో వినియోగం కేవలం రాజకీయ ప్రయోజనాల కోణంలోనే జరుగుతున్నాయని.. నైతిక బాధ్యతతో కాదని భారత్‌ ఉద్ఘాటించింది. దేశాల సార్వభౌమ సమానత్వ భావనకు విరుద్ధంగా కేవలం ఐదు శాశ్వత సభ్యదేశాలకు మాత్రమే వీటో అధికారం కట్టబెట్టారని మండిపడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని