Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..
1. ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’.. ఎన్నికల వరాలు ప్రకటించిన చంద్రబాబు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలో నిర్వహించిన మహానాడు వేదిక తెదేపా తెదేపా అధినేత చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరించారు. కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఖాతాల్లో వేస్తాం. మహిళల కోసం ‘మహాశక్తి’ కార్యక్రమం తెస్తామని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. పోరాటం పసుపు సైన్యం బ్లడ్‌లో ఉంది: లోకేశ్
తెదేపా అంటే ఘన చరిత్ర ఉన్న పార్టీ .. వైకాపా అంటే గలీజు పార్టీ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. రూ.లక్ష కోట్ల ఆస్తి ఉన్నవాడు పేదవాడా? లక్ష రూపాయల చెప్పులు వేసుకునే వాడు పేదవాడా? వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడా? అని ప్రశ్నించారు. సైకో జగన్ చిన్నప్పుడు చాక్లెట్ దొంగ.. పెద్దయ్యాక బడా చోర్‌గా మారాడని దుయ్యబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. రవికిషోర్ బ్యాంకు లావాదేవీల్లో.. ఏఈ పరీక్ష టాపర్ల వివరాలు
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఏఈ సివిల్ మాస్టర్ ప్రశ్నపత్రం పెద్ద ఎత్తున చేతులు మారినట్టు అధికారులు భావిస్తున్నారు. ఇటీవల కీలక నిందితులు రవికిషోర్ అరెస్టుతో నిందితుల వివరాలు బయటకు వస్తున్నాయి. వరంగల్ విద్యుత్‌శాఖ డీఈతో పాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. విపక్షాల భేటీకి ముహూర్తం ఖరార్.. జూన్ 12న పట్నాలో సమావేశం!
కేంద్రంలో ఎన్డీయే (NDA) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకమయ్యేందుకు విపక్ష పార్టీల (Opposition Parties) సమావేశానికి వేదిక ఖరారైంది. ఈ మేరకు విపక్ష పార్టీలు బిహార్ (Bihar) రాజధాని పట్నా (Patna)లో జూన్ 12న భేటీ కానున్నాయి. కాంగ్రెస్ (Congress), వామపక్ష పార్టీలతోపాటు తృణమూల్ కాంగ్రెస్ (TMC), ఆప్ (AAP) సహా 20 ప్రతిపక్ష పార్టీలు ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు (Ambati Rayudu) ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. నేడు గుజరాత్ టైటాన్స్‌తో జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచే తన కెరీర్‌లో చివరిదని వెల్లడించాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు. 2010లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన రాయుడు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. మణిపుర్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 40 మంది తిరుగుబాటుదారుల హతం
మణిపుర్‌లో (Manipur) తిరుగుబాటుదారులపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇవాళ ఒక్క రోజే 40 మందిని హతమార్చినట్లు వెల్లడించింది. తిరుగుబాటుదారులను మణిపుర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ (Biren singh) ఉగ్రవాదులతో పోల్చారు. 40 మంది ఉగ్రవాదులను కాల్చి చంపినట్లు భద్రతాబలగాల నుంచి సమాచారం అందినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. రాహుల్‌కు కొత్త పాస్‌పోర్టు జారీ.. అమెరికా పర్యటనకు సిద్ధం
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి కొత్తగా సాధారణ పాస్‌పోర్టు జారీ అయ్యింది. స్థానిక కోర్టు నిరభ్యంతర పత్రం జారీచేసిన రెండు రోజుల్లోనే రాహుల్‌కు ఈ కొత్త పాస్‌పోర్టు (Passport) వచ్చింది. దీంతో ఆయన సోమవారం నాడు అమెరికా పర్యటనకు బయలుదేరనున్నారు. ఇటీవల లోక్‌సభ సభ్యత్వంపై వేటు పడటంతో ఆయన దౌత్య పాస్‌పోర్టును కోల్పోయిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ‘ప్రస్తుత విలువలకు చిహ్నంగా అంగీకరించాలి’.. సెంగోల్‌పై కాంగ్రెస్ ఎంపీ ట్వీట్
నూతన పార్లమెంట్ భవనాన్ని (New Parliament Building) ప్రధాని మోదీ (PM Narendra Modi) ప్రారంభించడాన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెంగోల్ (Sengol) రాజదండంపై కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రస్తుత విలువలకు చిహ్నంగా సెంగోల్‌ను అందరం అంగీకరించాలని ట్వీట్‌లో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. కొత్త పార్లమెంట్‌పై షారుక్ ట్వీట్.. స్పందించిన ప్రధాని మోదీ..!
పార్లమెంట్ నూతన భవనం(new Parliament) ప్రారంభోత్సవం సందర్భంగా పలువురు సూపర్ స్టార్లు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్లు చేశారు. వీరిలో బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారుక్ ఖాన్(Shah Rukh Khan), సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth), అక్షయ్‌కుమార్(Rajinikanth) చేసిన ట్వీట్లకు ప్రధాని మోదీ (PM Modi) స్వయంగా స్పందించారు. నిన్న ప్రధాని మోదీ పార్లమెంట్‌కు సంబంధించిన ఓ వీడియోను ట్వీట్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. రెజ్లర్లపై దిల్లీ పోలీసుల తీరు దారుణం.. బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాల్సిందే..!
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌పై (Brij Bhushan Sharan Singh) చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తూ ప్రముఖ రెజ్లర్లు (Wrestlers Protest) చేపట్టిన పార్లమెంటు ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. జంతర్ మంతర్ నుంచి మార్చ్ నిర్వహించిన క్రీడాకారులు వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్, బజ్‌రంగ్ పునియాలను అడ్డుకున్న పోలీసులు.. వారిని నిర్బంధించి అక్కడి నుంచి తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
KTR: దిల్లీ బాస్‌ల అనుమతి లేకుండానే లక్ష్మణ్ అలా మాట్లాడారా?: కేటీఆర్
-
Rajinikanth: ‘తలైవా 170’ గురించి ఆసక్తికర విషయం పంచుకున్న రజనీకాంత్..
-
MS Dhoni: ప్రపంచ కప్‌లో మాహీ... ఎందుకంత స్పెషల్ అంటే!
-
US Speaker: అమెరికా చరిత్రలో తొలిసారి.. స్పీకర్‌కు ఉద్వాసన
-
Delhi Liquor Scam: ఆప్ నేత సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు
-
Asian Games: ఆర్చరీలో స్వర్ణం.. ఆసియా క్రీడల్లో భారత్ ‘పతకాల’ రికార్డ్