Nara Lokesh: పోరాటం పసుపు సైన్యం బ్లడ్‌లో ఉంది: లోకేశ్
తెదేపా అంటే ఘన చరిత్ర ఉన్న పార్టీ .. వైకాపా అంటే గలీజు పార్టీ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు.
రాజమహేంద్రవరం: తెదేపా అంటే ఘన చరిత్ర ఉన్న పార్టీ .. వైకాపా అంటే గలీజు పార్టీ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. రూ.లక్ష కోట్ల ఆస్తి ఉన్నవాడు పేదవాడా? లక్ష రూపాయల చెప్పులు వేసుకునే వాడు పేదవాడా? వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడా? అని ప్రశ్నించారు. సైకో జగన్ చిన్నప్పుడు చాక్లెట్ దొంగ.. పెద్దయ్యాక బడా చోర్‌గా మారాడని దుయ్యబట్టారు.
సైకో జగన్ పాలనలో యువత, మహిళలు, వృద్ధులు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు అందరూ బాధితులేనన్నారు. యువగళం పాదయాత్ర అడ్డుకోవడానికి సైకో జగన్ రాజారెడ్డి రాజ్యాంగం ప్రయోగిస్తే.. తాను అంబేడ్కర్ రాజ్యాంగంతో సమాధానం చెప్పానన్నారు. కార్యకర్తకు కష్టం వస్తే మీ లోకేశ్ ఆగడు.. కార్యకర్త ఇబ్బందుల్లో ఉంటే సైకో జగన్ స్పందించడని ఎద్దేవా చేశారు. తెదేపా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కడిని వదిలి పెట్టనని.. అమలాపురంలో ఉన్నా, అమెరికాలో ఉన్నా పట్టుకొచ్చి లోపలేస్తామని హెచ్చరించారు. పోరాటం పసుపు సైన్యం బ్లడ్‌లో ఉందన్న లోకేశ్.. ప్రతిపక్షంలో పోరాడిన ప్రతి కార్యకర్త బాధ్యత తనదని హామీ ఇచ్చారు. పేదలు ఎప్పటికీ పేదరింలో ఉండాలనేది సైకో జగన్ కోరిక అని మండిపడ్డారు. పేదరికం లేని రాష్ట్రం చూడాలన్నది మీ లోకేశ్ సింగిల్ పాయింట్ ఎజెండా అని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
సినిమాల కోసం ‘ఐఏఎస్’ త్యాగం!
-
సల్మాన్ సినిమా ఫ్లాప్.. నన్ను చచ్చిపోమన్నారు: హీరోయిన్
-
CBFC: విశాల్ ఆరోపణలు.. సెన్సార్ బోర్డు కీలక నిర్ణయం.. అదేంటంటే?
-
Google Bard - Team India: వన్డే ప్రపంచకప్.. గూగుల్ బార్డ్ చెప్పిన భారత్ తుది జట్టు ఇదే
-
Team India Final XI: ప్రపంచకప్లో ఏ 11 మంది దిగితే మంచిది? మీ ఆలోచన ఏంటి?
-
Hyderabadi Biryani: హైదరాబాదీ బిర్యానీ X కరాచీ బిర్యానీ.. పాక్ ఆటగాళ్లు ఎంత రేటింగ్ ఇచ్చారంటే?