Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 04 Apr 2024 09:04 IST

1. తాలిబన్‌ పాలనను తలదన్నేవారు జగన్‌కు సౌమ్యులట

వినేవాడు ఉంటే ‘టంగుటూరి మిరియాలు తాటికాయంత ఉంటాయన్నారంట’ వెనుకటి ఒకరు.. అలా ఉంది సీఎం జగన్‌ పరిస్థితి. వినే జనాలు ఉంటే అబద్ధాన్ని సైతం నిజమనుకునేలా అలవోకగా చెప్పేస్తారు. సభకు వచ్చిన జనాలు.. టీవీల్లో చూసే వారికి ఏమి తెలియదనుకుంటారో ఏమో.. లేదంటే అక్రమ సంపాదన, అరాచకాల్లో ఆయన కంటే తన అభ్యర్థులు తక్కువ చేస్తున్నారని భావిస్తున్నారో ఏమోగాని వారిని మంచివారు, సౌమ్యులంటూ చెబుతున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. జగన్‌ అనుయాయులకు రూ.వేల కోట్లు

జగన్‌ ప్రభుత్వం రూ.వేల కోట్లను తన పెత్తందారీ అనుయాయులకు పంచేసి పేదలకు పెన్షన్‌ సొమ్ము లేకుండా ఖజానా ఖాళీ చేసేసింది. ఏప్రిల్‌ 1వ తేదీన రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తదితరులకు పెన్షన్లు పంచవలసి ఉన్నా అందుకు తగ్గట్టుగా నిధులు సర్దుబాటు చేయలేదు. చేతిలో ఉన్న రూ.వేల కోట్లను జగన్‌ ప్రభుత్వానికి అనుకూలమైన బడా గుత్తేదారులకు, ఇతరులకు బిల్లుల రూపంలో పంచేశారు. ఇలా పంచే క్రమంలోనూ ఆర్థిక నిబంధనలను సైతం వైకాపా ప్రభుత్వం విస్మరించింది. ఫలితంగా ఏప్రిల్‌ 1, 2వ తేదీల్లో పెన్షన్లు పంచలేకపోయింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. ఐదేళ్లుగా గుర్రుపెట్టి.. గురుకులాలను వెనక్కి నెట్టి..

గురుకులాలు.. నాణ్యమైన విద్యను అందిస్తూ నైపుణ్యమున్న ఉపాధ్యాయులతో పిల్లల విద్యాభివృద్ధికి బాటలువేసే కేంద్రాలు. విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో వీటి పాత్ర అపారం. పేద, వెనకబడిన విద్యార్థులకు ఇవి వరం లాంటివి. వీటిలో సీటు దక్కితే విద్యార్థుల దశ తిరిగినట్లే అని అందరూ భావిస్తారు. వీటి ప్రాధాన్యాన్ని గుర్తించిన గత తెదేపా ప్రభుత్వం గురుకుల విద్యాలయాల ఏర్పాటుకు పెద్దపీట వేసింది. రాష్ట్ర విభజన నాటికి(2014) ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో 35 బీసీ గురుకులాలు ఉండగా.. 2019 నాటికి 106కు పెంచింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. హవ్వ.. పింఛన్ల పంపిణీ అద్భుతమట!

రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియ బుధవారం గందరగోళంగా మారింది. పంపిణీలో అనేక చోట్ల సమస్యలు కనిపించాయి. చాలా సచివాలయాల్లో పింఛనుదారులకు సరైన సౌకర్యాలు కల్పించలేదు. కొన్నిచోట్ల సచివాలయాలనే తెరవలేదు. ఇన్ని లోపాలున్నా.. ఆ శాఖను పర్యవేక్షిస్తున్న శశిభూషణ్‌కుమార్‌ పరిస్థితిని చక్కబెట్టేందుకు తీసుకుంటున్న చర్యల్ని ప్రస్తావించనే లేదు. అంతా అద్భుతంగా జరిగినట్టు ఓ ప్రకటన విడుదల చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. అసుర.. అసుర.. భూబకాసుర!

ఐదేళ్ల కిందట.. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్రంటే ఔననుకున్నారు ఆంధ్రాజనం! ఐదేళ్ల తర్వాత.. అర్థమైంది నాటి జగనన్న యాత్ర కష్టాలు తెలుసుకోవటం కోసం కాదు కబ్జాలు పెట్టడానికని! ఖాళీ స్థలాల్లో జెండా పాతడమే ఎజెండాగా.. కంకణం కట్టుకుని... అన్న అను‘చోరులంతా’ ఏకమై... పప్పుబెల్లాల్లా నీకిది.. నాకది అంటూ పంచుకున్నారు... అధికారమే అండగా.. అప్పనంగా సర్కారు స్థలాల్ని భూంఫట్‌ అన్నారు... ప్రైవేటు స్థలాలనూ పంచాయతీల పేరుతో స్వాహా చేశారు! మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. హార్డ్‌డిస్కుల నుంచి ఆధారాలెలా?

సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో అధికారులకు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఈ కేసులో అత్యంత కీలకమైన ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల నుంచి ఆధారాలు సేకరించడం సవాలుగా మారింది. చేసిన నేరం బయటపడకుండా ఉండేందుకు ప్రణీత్‌రావు ముఠా హార్డ్‌డిస్కుల వంటి వాటిని ధ్వంసం చేసి మూసీ నదిలో పడేయడంతో వీటి నుంచి సమాచారాన్ని పునరుద్ధరించడం కష్టంగా మారింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. పండుటాకులపై పగ

ఏం జరగకూడదని అందరూ ఆశించారో అదే జరిగింది! వైకాపా వికృత రాజకీయ క్రీడలో ప్రభుత్వ ఉన్నతాధికారులు తమ వంతు పాత్ర సమర్థంగా పోషించారు. వృద్ధులు మండుటెండల్లో పింఛను కోసం పడిగాపులు కాచేలా చేశారు. వారు ఇబ్బందులు పడుతుంటే.. నెపాన్ని విపక్షాలపై నెట్టేసేందుకు అధికార పార్టీ పన్నిన కుట్రను విజయవంతంగా అమలు చేసేందుకు ఉన్నతాధికారులు తోడ్పడ్డారు. ఎన్ని విమర్శలు వచ్చినా బేఖాతరు చేస్తూ ప్రజల ప్రయోజనాలకంటే అధికార పార్టీతో అంటకాగడమే ముఖ్యమని చాటిచెప్పారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. భానుడి సెగ.. భగభగ

రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. బుధవారం వివిధ ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. ఉదయం 7 గంటల నుంచే వేడి వాతావరణం నెలకొంటోంది. దీంతో వృద్ధులు, పిల్లలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. వడగాలుల తీవ్రత కూడా మరింత పెరగనుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. కొత్త గరిష్ఠాలకు పసిడి

పసిడి ధరల జోరు కొనసాగుతోంది. బుధవారం రాత్రి 11.30కు స్థానిక మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం(99.9 స్వచ్ఛత) ధర జీవనకాల గరిష్ఠమైన రూ.72,250కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరల ర్యాలీ ఇందుకు కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ వెల్లడించింది. ఈ వారంలో పసిడి జీవనకాల గరిష్ఠాలను తాకడం ఇది రెండోసారి. కేజీ వెండి కూడా భారీగా పెరిగి రూ.81,194 వద్ద ట్రేడవుతోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. కరెంట్‌లోనూ కోట్లాట

క్విడ్‌ప్రోకో అక్రమాలను ముఖ్యమంత్రి జగన్‌ విద్యుత్‌ రంగానికీ వర్తింపజేశారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) సమీక్ష పేరుతో వైకాపా ప్రభుత్వం హడావుడి చేసింది. విద్యుదుత్పత్తి సంస్థలను కోర్టుకు వెళ్లేలా చేసింది. అందులో కొన్ని సంస్థలతోనే ఇప్పుడు పీపీఏలు కుదుర్చుకోబోతోంది. ఇదీ జగన్నాటకంలో ఒక భాగం. ప్రకృతి వనరులను దోచుకోవడం ఎలాగో తెలిసిన జగన్‌.. గాలినీ తన దోపిడీ కోసం వదల్లేదు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని